కోడి ముందా? గుడ్డు ముందా?

ఫొటో సోర్స్, Getty Images
కారణవాదంతో వచ్చే చిక్కులేమిటో ప్రపంచానికి తెలియజెప్పేందుకు ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు 2 వేల ఏళ్ల కిందట వేసిన ప్రశ్న ఇది.
ఇప్పటికీ కచ్చితమైన సమాధానం దొరకలేదు.
కానీ క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం, నీల్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్తలు దీనికి తాము సమాధానం కనిపెట్టేశామంటున్నారు.
గుడ్డు, కోడి.. రెండూ ఒకేసారి ఉద్భవించి ఉండొచ్చన్నదే తాము కనుక్కొన్న సమాధానమని వారు చెబుతున్నారు.
ఇందుకు వీరు క్వాంటమ్ ఫిజిక్స్‌లో లాజిక్ ఉదాహరణంగా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరిశోధకులు చెబుతున్న ప్రకారం క్వాంటమ్ ఫిజిక్స్‌లో కారణం.. దాని ప్రభావం ఎప్పుడూ ఒకేలా ఒకదాని తర్వాత ఒకటి ఉండదు.
అంటే ఒక ఘటన వల్ల మరో ఘటన అన్నివేళలా జరగదు.
ఈ అంశంపై ఆస్ర్టేలియన్ రీసెర్చ్ కౌన్సిల్ పరిశోధకులు జాక్వి రోమెరో మాట్లాడుతూ..'' క్వాంటమ్ మెకానిక్స్‌లో ఉన్న విశేషం ఏంటంటే.. ఘటనలు ఒక పద్ధతి ప్రకారం జరుగవు.'' అని అన్నారు.
''ఉదాహరణకు.. మీరు రోజువారీ కార్యాలయానికి వెళ్తూ సగం దూరం బస్సులో.. మిగతా సగం రైల్లో ప్రయాణిస్తారని అనుకుందాం. ఇక్కడ ముందు మీరు బస్సులో వెళ్తి.. తర్వాత రైల్లో ప్రయాణిస్తారు.'' కానీ మా ప్రయోగంలో ఈ రెండు ఘటనల్లోనూ ఏదైనా ముందు జరుగవచ్చని తేలింది అని చెప్పారు. దీన్నే.. '' అనిర్ధిష్టమయిన కారణాల క్రమం'' అని అంటారని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విషయాన్ని గుర్తించడానికి వీరు ప్రయోగశాలలో ఓ ఫొటానిక్ క్వాంటమ్ స్విచ్‌ని నిర్మించారు.
క్వీన్స్ లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు ఫాబియో కోస్టా చెబుతున్న ప్రకారం.. ఈ స్విచ్ కాంతి రూపంలో సంఘటనల క్రమాన్ని అంచనా వేసి ఒక ధ్రువీకరణకు వస్తుంది.
అయితే ఇది చాలా ప్రాధమిక సిద్ధాంతమని.. అనిర్ధిష్టమయిన కారణాల క్రమాన్ని అంచనా వేయడం ద్వారా మరింత సమర్థవంతమైన కంపూటర్లను, సమాచార వ్యవస్థను అభివృద్ధి చేయొచ్చని వివరించారు.
ఈ అధ్యయన వివరాలను అమెరికన్ ఫిజికల్ సొసైటీ ఫిజికల్ రివ్యూస్ లెటర్స్‌లో ప్రచురించారు.
ఇవి కూడా చదవండి
- బ్యాగరి మహిళలు: శవాల మధ్య బతుకు పోరాటం
- కేరళ వరదలు: ఈ పెను విపత్తుకు కారణాలేమిటి?
- కొరియా కుటుంబాలు: 60 ఏళ్ల కిందట యుద్ధంతో విడిపోయారు.. ఇప్పుడు కలుస్తున్నారు
- ‘ఇండియాలోని భారతీయులకంటే బ్రిటన్‌లోని భారతీయులే సంప్రదాయబద్ధంగా జీవిస్తున్నారు’
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)