ఆరోగ్యం: ప్రజలంతా స్మార్ట్ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది?

  • జరియా గార్వెట్
  • బీబీసీ కోసం
స్మార్ట్ డ్రగ్స్

ఫొటో సోర్స్, Getty Images

కాఫీ మెదడుపై బాగా పనిచేస్తుందని నమ్మేవారుప్రముఖ ఫ్రెంచి రచయిత ఓనేరే దీ బల్జాక్. ఆయనకు ప్రతి సాయంత్రం ఓ కష్టం వచ్చి పడేది. అర్థరాత్రి తర్వాత ఆయన ఏదైనా కెఫెతెరిచి ఉందేమోనని వెతుక్కుంటూ పారిస్ వీధులన్నీ తిరిగేవారు. కాఫీ తాగాక ఉదయం వరకూ రాస్తూ కూచునేవారు. ఆయన రోజుకు అలా 50 కప్పుల కాఫీ స్వాహా చేసేవారని చెబుతారు.

అలా ఆయన పిడికెడు కాఫీ గింజలు నోట్లో పోసుకుని నమిలితే కానీ ఉత్తేజం పొందలేని స్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా, ఖాళీ కడుపుతో కాఫీ గింజలు తింటే ఉత్సాహం ఇనుమడిస్తుందని ఆయన భావించేవారు. కాఫీ గింజల్ని నమిలాక.. నోరంతా కాఫీ ఉన్నట్టు అనిపించగానే, ఆయన మనసులోని యుద్ధ క్షేత్రంలో భారీ సైన్యం వేగంగా మార్చ్ చేస్తున్నట్లు ఐడియాలు తన్నుకొచ్చేసేవి.

అది పనిచేసిందేమో, బల్జాక్ చాలా పుస్తకాలు రాశారు. ఆయన తన జీవితకాలంలో 100 నవలలు, కథలు, నాటకాలు రాశారు. తర్వాత 51 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఓనేరే దీ బల్జాక్ ప్రారంభంలో స్మార్ట్ డ్రగ్స్ తీసుకనే వారని అంటారు. రోజుకు ఆయన 50 కప్పుల కాఫీ తాగేవారు.

శ్రామికులకు కెఫీన్ శక్తి

కొన్ని శతాబ్దాలపాటు కార్మికులందరూ తమ రోజువారీ పనులను పూర్తి చేయడానికి అప్పటి కెఫీన్ పైనే ఆధారపడుతూ ఉండేవారు. కానీ అది అక్కడివరకే. ఆధునిక తరం వారికి ఇప్పుడు ప్రయోగాలు చేయడానికి ఎన్నో రకాల సరికొత్త పదార్థాలు పుట్టుకొచ్చాయి. అవి మానసిక సామర్థ్యాలను సూపర్ చార్జ్ చేస్తాయని, మరింత ముందుకెళ్లడానికి సాయం చేస్తాయని అందరూ అనుకుంటున్నారు.

నిజానికి స్మార్ట్ డ్రగ్స్‌ అని చెప్పే వీటిలో కొన్ని ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయి. వేల మందిపై జరిగిన ఒక తాజా సర్వే ప్రకారం 30 శాతం మంది అమెరికన్లు గత ఏడాదే తాము వాటిని తీసుకున్నట్టు చెప్పారు. అది చూస్తుంటే మనం కూడా తొందరలోనే ఆ జాబితాలో ఉంటామేమో అనిపిస్తోంది. అలాంటి పరిణామాల్లో మనం కూడా కొట్టుకుపోవడం అనేది చాలా సులభమే. వీటిని ఉపయోగించే ఈ నవతరం మేధావులు అద్భుతమైన అత్యాధునిక ఆవిష్కరణలకు, తిరుగులేని ఆర్థిక వృద్ధికి కారణమవుతారా? లేదంటే మరింత సమర్థులు కావడం అనేది, వారి పని కాలాన్నే తగ్గించేస్తుందా? ఏం జరుగుతుంది.

మైండ్ బెండింగ్?

ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలంటే మనం మొదట అవేంటో తెలుసుకోవాలి.

అసలుసిసలు స్మార్ట్ డ్రగ్ పేరు పైరాసెటమ్. దాన్ని రుమేనియా శాస్త్రవేత్త కొర్నేలూ జార్జియా 1960లో కనిపెట్టారు. ఆ సమయంలో ఆయన మెల్లగా మెదడులో ఎక్కి నిద్రముంచుకొచ్చే ఒక మందు కోసం చూస్తున్నారు,. నెలలతరబడి పరిశోధనలు చేశాక, ఆయన 'కంపౌండ్ 6215' కనిపెట్టారు. అది సురక్షితమైనది, దాని చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. కానీ, అది పనిచేయలేదు. ఆ మందు ఎవరినీ ప్రశాంతంగా నిద్రపోయేలా చేయలేదు. పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కనిపించింది.

అంటే, ఆ పైరాసెటమ్‌కు ఒక రహస్యమైన సైడ్ ఎఫెక్ట్ ఉంది. రోగులు దానిని కనీసం నెల రోజులు వాడగానే.. అది వారి జ్ఞాపకశక్తి గణనీయంగా మెరుగుపడడానికి కారణం అయ్యింది. తను కనుగొన్న పదార్థానికి ఫలితం ఏంటో జార్జియాకు వెంటనే తెలిసొచ్చింది. దాంతో "నూట్రోపిక్" అనే పేరుతో దాన్ని వాడుకలోకి తెచ్చారు. "మనసును వంచడం" అనే మాటకు అది గ్రీకు పదం.

ఫొటో సోర్స్, Getty Images

ఆమోదం లేకున్నా విచ్చలవిడి వినియోగం

ప్రస్తుతం తమ సామర్థ్యం మెరుగుపరుచుకోవాలని చూసే విద్యార్థులు, యువ నిపుణులకు పైరాసెటమ్ ఫేవరెట్ డ్రగ్ అయ్యింది. జార్జియా దానిని కనిపెట్టి దశాబ్దాలు అవుతున్నా.. ఇది ఆరోగ్యంగా ఉన్నవారి మానసిక సామర్థ్యం మెరుగుపడేలా చేస్తుందని ఇప్పటికీ పెద్దగా ఆధారాలు లభించలేదు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీన్ని వైద్యంలో ఆమోదించకపోయినా, ఆహార సప్లిమెంటుగా అమ్మకూడదని చెప్పినా, బ్రిటన్‌లో దీనిని వైద్యులు ప్రిస్కిప్షన్‌పై పైరాసెటమ్‌ను రాస్తున్నారు.

టెక్సాస్‌లో ఉంటున్న వ్యాపారవేత్త, పోడ్‌కాస్టర్ మన్సల్ డెంటన్, ఫినైల్‌పైరాసెటమ్ తీసుకుంటారు. అది పైరాసెటమ్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. దీనిని నిజానికి సోవియట్ యూనియన్ తమ అంతరిక్ష యాత్రికుల కోసం తయారు చేసింది. ఇది వారు ఒత్తిడితో ఉండే అంతరిక్ష జీవితాన్ని తట్టుకోగలిగేలా చేస్తుంది. "నేను దాన్ని తీసుకుంటే కొన్ని విషయాలు వ్యక్తం చేయడానికి చాలా సులభంగా ఉండేది. అందుకే ఆ రోజుల్లో నేను చాలా రికార్డింగ్స్ చేసేవాడ్ని" అని ఆయన చెప్పారు.

నిజానికి స్మార్ట్ డ్రగ్స్ వాడకం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. రెగ్యులర్‌గా వీటిని తీసుకునేవారిని చాలా మంది ఉత్సాహంగా అనుసరిస్తున్నా.. వాటివల్ల మెదడుకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనేది నిరూపితం కాలేదు లేదంటే తక్కువని చెప్పాలి. వాటిని వాడడం వల్ల పనివల్ల కలిగే సంతృప్తి మనకు చాలా తక్కువగా ఉండేలా చేసింది. స్మార్ట్ డ్రగ్స్ వల్ల భిన్నంగా ఏం జరగదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

క్రియాటిన్ ఎన్నో ఏళ్లుగా బాడీ బిల్డర్స్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు దీనిని జ్ఞాపకశక్తి పెంచుకోడానికి వాడుతున్నారు

బ్రెయిన్ గేమ్స్

క్రియాటైన్ మోనోహైడ్రేట్ విషయానికి వస్తే, ఈ ఆహార సప్లిమెంటులో ఒక తెల్ల పొడి ఉంటుంది. దాన్ని మనం డ్రింకుల్లో, మిల్క్ షేక్స్‌లో కలిపి తాగవచ్చు, లేదంటే మాత్రలు వేసుకోవచ్చు. ఈ రసాయనం సాధారణంగా మన మెదడులోనే ఉంటుంది. కానీ ఈ క్రియాటిన్ అదనంగా పొందడం వల్ల అది జ్ఞాపకశక్తి, తెలివి పెంచుతుందని కొన్ని ఆధారాలున్నాయి.

ఉన్నత స్థాయికి చేరాలనుకునే యువ నిపుణులకు ఇది కొత్తే అయినా, బాడీ బిల్డర్స్ క్రియేటిన్‌ను చాలా కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. కండలు పెంచడం కోసం వాళ్లు దీన్ని దశాబ్దాలుగా తీసుకుంటున్నారు. అమెరికాలో స్పోర్ట్స్ సప్లిమెంట్స్ వ్యాపారం లక్షల డాలర్లలో జరుగుతుంది. దాన్లో అధిక వాటా క్రియేటిన్‌దే. ఇప్సోస్ పబ్లిక్ అఫైర్స్ గత ఏడాది నిర్వహించిన ఒక సర్వేలో అంతకు ముందు ఏడాది స్పోర్ట్స్ సప్లిమెంట్స్ తీసుకున్నామని 22 శాతం మంది వయోజనులు చెప్పారు. పనిచేసే ప్రాంతాల్లో క్రియేటిన్ ఎక్కువ ప్రభావం చూపించుంటే, మనకు ఇప్పటికే దాని సంకేతాలు కొన్ని కనిపించేవి.

అయినా, మరింత పరివర్తన శక్తులు అందించే డ్రగ్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని పనిచేస్తున్నట్టు అనిపించిందని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, న్యూరోసైంటిస్టు ఆండ్రూ హ్యూబెర్‌మన్ చెప్పారు. నిజానికి స్మార్ట్ డ్రగ్‌లోని ఒక కేటగిరీ శాస్త్రవేత్తలు, బయోహ్యాకర్ల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. వాటికి మిగతా వాటికి లేని, సొంత బయాలజీ, సామర్థ్యాలు ఉన్నాయి. అవే స్టిములంట్స్ (ఉత్ప్రేరకాలు)

బాగా పాపులర్ అయిన రెండు ఆప్షన్లు ఉన్నాయి. అవే ఆంఫిటమైన్స్( మెదడు ఉత్తేజపరిచే మందులు), మెథిల్‌ఫీనిడేట్. అడెరల్, రిటలిన్ బ్రాండ్ పేరుతో వచ్చే ఈ మందులను ప్రిస్కిప్షన్ ద్వారా అమ్ముతున్నారు. అమెరికాలో ఈ రెండింటినీ ADHD ఉన్న వారి చికిత్సకు ఆమోదించారు. ఈ ప్రవర్తన వ్యాధికి గురైన రోగులు స్థిరంగా కూచునేలా, ఏకాగ్రత కలిగేలా ఈ డ్రగ్ పనిచేస్తుంది. వీటిని ఇప్పుడు పోటీ రంగాల్లో ఉండేవారు, ఏదైనా లక్ష్యంపై దృష్టిపెట్టాలనుకునేవారు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ డ్రగ్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రిటలిన్ ఏడీహెచ్‌డీ చికిత్సకు ఉపయోగించే ఉత్ప్రేరకం. దీన్ని కొందరు తమ ఫోకస్ మెరుగుపరచుకోవడానికి తరచూ దుర్వినియోగం చేస్తున్నారు

ప్రమాదం పొంచి ఉన్నా వినియోగం

ఆంఫిటమైన్స్‌కు స్మార్ట్ డ్రగ్స్‌గా సుదీర్ఘ చరిత్ర ఉంది. 19 గంటలు ఏకధాటిగా లెక్కలు వేయడానికి గణిత శాస్త్రజ్ఞుడు పాల్ ఎర్డోస్, ఒకేసారి రెండు పుస్తకాలు రాసేందుకు రచయిత గ్రాహమ్ గ్రీస్ వీటిని ఉపయోగించారు. ఇటీవల జర్నలిజం, కళలు, ఆర్థిక రంగంలో కూడా వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు మ్యాగజైన్లలో ఎన్నో కథనాలు కనిపిస్తున్నాయి.

అయితే వాటి గురించి మనం ఎలా అనుకున్నా, వాటిని వాడుతున్న వాళ్లు మాత్రం అవి పనిచేస్తున్నాయని గట్టిగా చెబుతారు. 2015లో ఒక సమీక్షను బట్టి తెలివితేటలపై వాటి ప్రభావం మితంగా ఉందని తేలింది. కానీ చాలామంది వాటిని తమ మానసిక సామర్థ్యం పెరగడానికి తీసుకోకుండా మానసిక శక్తికి, పనికి ప్రేరణ కలిగించేలా వాడుతున్నారు. (ఈ రెండు డ్రగ్స్ వాడడం వల్ల తీవ్రమైన సమస్యలు, సైడ్ ఎఫెక్టులు కనిపిస్తున్నాయి-తర్వాత మరిన్ని వస్తున్నాయి)

అడెరల్, రిటలిన్ లాంటి స్టిములంట్స్ తీసుకోవడం వల్ల ఏర్పడే పర్యవసానాల్లో మాససికంగా టాక్సింగ్ లక్ష్యాలకే పరిమితం కావడం అనే సామర్త్యం ఒకటి. వారు ముఖ్యంగా చివర్లో ఒకదానిపైనే స్పష్టంగా దృష్టి పెట్టగలుగుతారు. గణితం లక్ష్యంగా తీసుకున్న కొంతమందిపై జరిగిన ఒక అధ్యయనంలో చివరికి వారికి అది ఆసక్తికరమైనదని అనిపించింది.

ఒక ఆఫీసులో పనిచేసేవారందరూ ప్రిస్కిప్షన్ మీద ఉద్దీపకాలు తీసుకుంటే.. అది రెండు ప్రభావాలు చూపించవచ్చు. మొదట జనం తమకు ఇష్టం లేని లక్ష్యాలకు దూరంగా ఉండడం లాంటివి జరగదు. అంటే అలసిపోయి పనిమీద దృష్టి పెట్టని వారు, ఫైలింగ్ సిస్టమ్ బాగా చూసుకోవడం, స్ప్రెడ్ షీట్స్ అప్- టు-డేట్ ఉంచడం, బోరుకొట్టే మీటింగులకు ఉత్సాహంగా హాజరవడం జరుగుతుంది.

ఇక రెండోది. ఆఫీసులో ఎక్కువగా పోటీతత్వం వచ్చేస్తుంది. ఇది సాధారణంగా స్మార్ట్ డ్రగ్స్ దీర్ఘకాలిక సైడ్ ఎఫెక్టుల గురించి అందరూ అనుకునేదానికి సరిగ్గా అతికినట్టు ఉంటుంది. అయితే అది మంచిదా, కాదా అనేదానిపై చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

పోటీని పెంచేస్తున్న స్మార్ట్ డ్రగ్స్

"సిలికాన్ వాలీ, వాల్ స్ట్రీట్‌లో పనిచేసే సిబ్బంది నూట్రోపిక్స్ వాడడం అంతకంతకూ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. అది పోటీ ఎక్కువగా ఉండే చోట మేధావులు, నిపుణులు, క్రీడాకారులు ఉపయోగిస్తున్నట్టే ఉంది" అని HVMN న్యూట్రిషన్ కంపెనీ కో ఫౌండర్, సీఈవో జాఫ్రీ వూ చెప్పారు. అది నూట్రోపిక్ సప్లిమెంట్స్ కోసం అందరూ క్యూకట్టేలా చేస్తోంది. నూట్రోపిక్స్ వారి మధ్య పోటీని అంతకంతకూ పెంచేస్తోంది అని డెంటన్ కూడా అంగీకరించారు. ఉదాహరణకు "చైనా, రష్యా మేధావులు అమెరికాలోకి సులభంగా రావచ్చు. అది పెరుగుతోంది. అందుబాటులో ఉన్న ఎలాంటి అవకాశాన్నైనా అందుకోవాలనే కోరిక ఎక్కువుతోంది" అన్నారు.

కానీ అక్కడ ముఖ్యమైన దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఆంఫిటమైన్స్ నిర్మాణపరంగా క్రిస్టల్ మెత్ అనేదానిలా ఉంటుంది. శక్తివంతమైన ఇది చాలా వ్యసనంలా మారే ఒక వినోదం అందించే డ్రగ్. అది చాలా జీవితాలను నాశనం చేసింది, ప్రాణాంతకం కూడా కావచ్చు. అడెరల్, రిటలిన్ రెండూ వ్యసనం కావచ్చు. వాటిని వదులుకోలేక ఎంతోమంది కార్మికులు బాధపడుతున్నట్టు ఎన్నో నివేదికలు చెప్పాయి. వాటికి నరాల బలహీనత, ఆందోళన, నిద్రలేమి, కడుపు నొప్పి, జుట్టు రాలడం లాంటి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.

చివరగా, ఒక ఆఫీసులో ఎక్కువగా ఉద్దీపకాలు తీసుకున్నంత మాత్రాన సిబ్బంది దాని ఓవరాల్ ఉత్పత్తి మరింత పెంచగలరని చెప్పలేం. "ఎవరైనా ఇవి ప్రమాదకరం అనుకుంటే, దానిని తక్కువ సమయంలోనే గుర్తించడం చాలా ముఖ్యం" అని హ్యుబెర్‌మన్ తెలిపారు. కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉంది. "ఆ తర్వాత మనకు రోజు ఎలా అనిపిస్తుంది. బహుశా నాలుగు గంటలు, 12 గంటలు ఏకాగ్రతతో పనిచేయచ్చు. కానీ తర్వాత మన సగటు సామర్థ్యం 24 లేదా 48 గంటల కంటే తక్కువకు పడిపోతుంది

ఈ లోపాలు, చూస్తుంటే స్టిములంట్స్ ఇప్పుడప్పుడే ప్రపంచాన్ని అంత మార్చలేవనే ఊహలో నిజముందనే విషయం అర్థమవుతోంది. కానీ దానికి ఒక దగ్గరి వెర్షన్ ఉంది. వాటిని మీరు ఏదైనా కేఫ్, రెస్టారెంట్, సూపర్ మార్కెట్లో కొనుక్కోవచ్చు. అదే కెఫీన్.

అమెరికాలో ప్రజలు ఫిజ్జీ డ్రింక్, టీ, జ్యూసుల కంటే ఎక్కువ కాఫీ తాగుతున్నారు. అయినా, అది ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని వారిలో ఎవరికీ ఎప్పుడూ అనిపించలేదు. కానీ దానిలో చాలా ఇతర ప్రయోజనాలు ఉన్నాయని ఎన్నో అధ్యయనాలు గుర్తించాయి. వాటిలో కొన్ని వూ'స్ కంపెనీ కెఫిన్ ఆధారిత సప్లిమెంట్స్ కంటే కెఫిన్ మెరుగైనదని నిరూపించాయి. ప్రస్తుతం మార్కెట్లో దాని ధర 60 మాత్రలకు 17.65 డాలర్లు (1300 రూపాయలు) ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కాఫీ-శతాబ్దాలుగా లక్ష్యంపై దృష్టి పెట్టడానికి సాయం చేస్తోంది

మరో పాపులర్ ఆప్షన్ నికోటిన్. శాస్త్రవేత్తలు ఈ డ్రగ్‌ బలమైన నూట్రోపిక్ అని తెలుసుకుంటున్నారు. ఒక వ్యక్తి జ్ఞాపకశక్తిని పెంచి, వారు కొన్ని లక్ష్యాలపై దృష్టి పెట్టే సామర్తాన్ని ఇది మెరుగుపరుస్తుంది. అయినా దీనిలో కూడా కచ్చితంగా సమస్యలు, సైడ్ ఎఫెక్టులు ఉన్నాయి. "జ్ఞాపకశక్తి పెంచుకోడానికి నికోరెట్టే నమలాల్సిన కొందరు ప్రముఖ నాడీ శాస్త్రవేత్తలు, దానికి బదులు పొగ తాగేవారు. అది వాళ్ల ప్రత్యామ్నాయం" అని హ్యూబర్‌మన్ అంటారు.

అయితే మనమంతా స్మార్ట్ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పటికే మనం చాలావరకు ఆ పని చేస్తూనే ఉన్నాం. పొద్దున్నే లేచి కప్పు కాఫీ తాగడంతోనే మన స్మార్ట్ డే మొదలైపోతోంది. ఈ సంగతి బల్జాక్ ఎప్పుడో చెప్పారు కదా!

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)