2018 నోబెల్ బహుమతులు: విప్లవాత్మక క్యాన్సర్ చికిత్స విధానం కనుగొన్న శాస్త్రవేత్తలకు వైద్యంలో నోబెల్ బహుమతి

  • 1 అక్టోబర్ 2018
క్యాన్సర్ కణాలు Image copyright Spl

మానవ శరీరంలోని సహజ సిద్ధమైన రోగనిరోధక శక్తి సహాయంతో క్యాన్సర్‌ను జయించే విధానాన్ని కనుగొన్న ఇద్దరు శాస్త్రవేత్తలకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది.

అమెరికాకు చెందిన జేమ్స్.పి.అలిసన్, జపాన్‌కు చెందిన టసూకు హోంజోలు ఈ పరిశోధన చేసి నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు.

ఈ రకమైన క్యాన్సర్ చికిత్సావిధానం అత్యంత విప్లవాత్మకమైనదని పురస్కారం ఇచ్చే స్వీడిష్ అకాడమీ సంస్థ తెలిపింది.

ఈ విధానం మంచి ఫలితాలనిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అలిసన్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. హోంజో క్యోటో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)