స్మార్ట్ ఫోన్ వాడే పిల్లల తెలివితేటలు పెరుగుతాయా? తగ్గుతాయా?
- అలెక్స్ తెర్రెన్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, iStock
చిన్నారులు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల తెరలను వినియోగించే సమయాన్ని తగ్గిస్తేనే వారిలో తెలివితేటలు పెరుగుతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.
రోజుకు రెండు గంటల కంటే తక్కువ సమయం స్మార్ట్ తెరలను వినియోగించే 11 ఏళ్లలోపు పిల్లల్లో మానసిక సామర్థ్యం మెరుగ్గా ఉంటుందని తేలింది.
తెరల వాడకాన్ని తగ్గించడంతోపాటు చిన్నారులు రోజుకు 11 గంటలు నిద్రపోతే మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయని ఆ పరిశోధన పేర్కొంది.
తెర మీద గడిపే సమయానికి, ప్రజ్ఞకు మధ్య సంబంధాన్ని మాత్రమే తాము అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించామని శాస్త్రవేత్తలు చెప్పారు.
4,500 మంది అమెరికా చిన్నారులపై జరిపిన ఈ అధ్యయనం వివరాలను 'ద లాసెంట్ చైల్డ్ అండ్ అడొలెసెంట్ హెల్త్' జర్నల్‌లో ప్రచురించారు.
ఫొటో సోర్స్, Getty Images
శారీరక వ్యాయామం, నిద్ర, స్క్రీన్ మీద గడుపుతున్న సమయం, భాషను ప్రాతిపదికగా తీసుకొని ఈ అధ్యయనం చేశారు.
అయితే, పిల్లలు ఏ విధంగా స్క్రీన్‌ను వినియోగిస్తున్నారు? టీవీ చూస్తూనా, వీడియో గేమ్స్ ఆడుతూనా, లేక సోషల్ మీడియా వాడుతూనా అనేది తాము పరిశీలించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఏ తెర వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయో వేరువేరుగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని వారు అంటున్నారు.
కెనడాలోని ఒట్టావా కేంద్రంగా పనిచేసే సీహెచ్ఈవో పరిశోధన సంస్థకు చెందిన డాక్టర్ జెర్మె వాల్ష్ మాట్లాడుతూ, ‘‘మా అధ్యయనాన్ని అనుసరించి విధాన కర్తలు, విద్యాధికులు, తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు.
అయితే, వీడియో గేమ్స్, చదువుకు సంబంధించిన టీవీ కార్యక్రమాల వల్ల పిల్లల్లో గ్రహణ శక్తి పెరుగుతున్నట్లు తేలిందన్నారు. కానీ, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకం ప్రమాదకరమని, ఇది పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
ఫొటో సోర్స్, Getty Images
కొన్ని పరిమితులకు లోబడి, పిల్లల నుంచి నేరుగా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అధ్యయనం చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు.
అయితే, అధ్యయనం ఆరంభం సమయంలో తీసుకున్న వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని, ఆ తర్వాత ఇప్పటి వరకు వారి ప్రవర్తనలో ఏవైనా మార్పులొచ్చాయా? లేదా? అన్నది పరిశీలించలేదని చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
ఈ అధ్యయన ఫలితాలతో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం సీనియర్ పరిశోధకుడు డాక్టర్ కిర్‌స్టన్ కోర్డర్ కూడా ఏకీభవించారు. తెరలపై గడిపే సమయం పిల్లల్లో గ్రహణ శక్తిపై ప్రభావం చూపుతుందని గతంలో చెప్పిన విషయాన్ని తాజా అధ్యయనం మరోసారి రుజువు చేసిందని ఆమె అన్నారు.
అయితే, ఇలాంటి అధ్యయనాల కోసం అడిగే ప్రశ్నలకు పిల్లలు ఇబ్బందిపడి కచ్చితమైన సమాధానాలు చెప్పకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కాబట్టి, పిల్లలపై స్మార్ట్ తెరల ప్రభావం ఎంతగా ఉంటుందన్న విషయాన్ని కచ్చితంగా చెప్పాలంటే మరిన్ని అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవికూడా చదవండి:
- ఈ మిరపకాయ తింటే ఆసుపత్రిపాలే!
- మృత్యువును కూడా మోసం చేయొచ్చా?
- అవునా.. ఐన్‌స్టీన్‌ది మొద్దు నిద్రా?
- క్యాన్సర్‌ను పసిగట్టే రక్తపరీక్ష!!
- మరణంతో మెదడు పోరాడుతుందా? చనిపోయే ముందు ఏం జరుగుతుంది?
- ఎవరు అబద్ధాల కోరు?
- ఏం చేసినా బరువు తగ్గట్లేదా? ఈ ఐదూ కారణాలు కావొచ్చు..
- సిరియా: ఇది సైన్యాల మధ్య పోరాటం కాదు.. ప్రజలపై జరుగుతున్న యుద్ధం
- సెరెనా విలియమ్స్: ’యూఎస్ ఓపెన్ ఫైనల్లో అంపైర్ లింగవివక్ష చూపారు‘
- శ్రీలంక: యుద్ధం ముగిసి పదేళ్లైంది.. మరి అదృశ్యమైన తమిళ టైగర్లు ఎక్కడ?
- కోర్టు తీర్పుతో ఇప్పుడు స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)