భౌతికశాస్త్రం ముఖచిత్రాన్ని మార్చేసిన నలుగురు మహిళా శాస్త్రవేత్తలు

  • 5 అక్టోబర్ 2018
ఫిజిక్స్ ముఖచిత్రాన్ని మార్చిన నలుగురు మహిళలు

భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మూడో మహిళగా డోనా స్ట్రిక్‌ల్యాండ్ చరిత్ర సృష్టించారు. ఆమెకన్నా ముందు 1903లో మేరీ క్యూరీ, 1963లో గోపర్ట్ మేయర్‌లను ఫిజిక్స్ నోబెల్ వరించింది.

అయితే, భౌతికశాస్త్రం ముఖచిత్రాన్ని మార్చేసిన మహిళా పరిశోధకులు ఇంకా ఉన్నారు. వారిలో ముఖ్యమైన నలుగురు మహిళల గురించి తెలుసుకుందాం.

Image copyright THE INSTITUTION OF ENGINEERING AND TECHNOLOGY
చిత్రం శీర్షిక హెర్తా అయర్టన్

హెర్తా అయర్టన్, బ్రిటిష్ భౌతికశాస్త్రవేత్త, గణాంకశాస్త్రవేత్త

జన్మస్థలం: హ్యాంప్‌షైర్‌లోని పోర్ట్‌సీ (1854-1923)

విద్య: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని గ్రిటన్ కాలేజీలో గణితశాస్త్రం చదివారు.

ఘనత: రాయల్ సొసైటీ ఫెలోగా నామినేట్ అయిన మొదటి మహిళ (నిజానికి మహిళలను రాయల్ సొసైటీకి ఎన్నుకోవటం కుదరదు)

శాస్త్ర రంగంలో విజయాలు: ఫిన్స్‌బరీ టెక్నికల్ కాలేజీలో ఫిజిక్స్ క్లాసులకు హాజరయ్యారు. అక్కడ ఆ పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ విలియం అయర్టన్‌ను అనంతర కాలంలో ఆమె వివాహమాడారు. భౌతికశాస్త్రం, విద్యుత్‌ల మీద ఆయన ప్రయోగాలకు సాయం చేశారు. ఎలక్ట్రిక్ ఆర్క్ (విద్యుత్ చాపం) - గ్యాస్ విద్యుత్ విచ్ఛేదనం - అంశంలో స్వయంగా నిష్ణాతురాలయ్యారు. సొంత పరిశోధనల ద్వారా పలు పత్రాలు ప్రచురించారు. 1899లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్‌లో మొదటి మహిళా సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1902లో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఫెలోగా నామినేట్ అయిన మొదటి మహిళగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. అయితే, ఆమె మహిళ అయినందున ఎన్నిక కాలేదు.

Image copyright Science Photo Library
చిత్రం శీర్షిక వెరా రూబిన్

వెరా రూబిన్, అమెరికన్ ఖగోళశాస్త్రవేత్త

జన్మస్థలం: పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా (1928-2016)

విద్య: కార్నెల్ యూనివర్సిటీలోని వాసర్ కాలేజీలో చదువుకున్నారు

ఘనత: అమెరికన్ ఖగోళశాస్త్రవేత్తల్లో ఆద్యులు, మహిళా శాస్త్రవేత్తల్లో అగ్రగామి

శాస్త్ర రంగంలో విజయాలు: విశ్వంలో డార్క్ మేటర్ (నిగూఢ పదార్థం) - ఒక రకమైన అదృశ్య పదార్థం అనేది ఒకటుందన్న అంశాన్ని ఆమె పరిశోధన నిర్ధారించింది. నక్షత్రమండలాల అంచుల్లోని నక్షత్రాలు ఊహించిన దానికన్నా వేగంగా కదులుతున్నాయనేందుకు ఆధారాలు అందించటానికి ఆమె సాయపడ్డారు. ఆమె గుర్తించిన అంశాలను గురుత్వాకర్షణ నియమంతో సరిచూసుకోవటానికి.. మనం చూడలేని పదార్థం ఒకటి ఉందని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఆ పదార్థాన్ని డార్క్ మేటర్ అని అభివర్ణించారు. ఆమె అధ్యయనాల వల్ల ఆమెకు అనేక గౌరవాలు లభించాయి. అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కి ఎంపికైన రెండో మహిళా ఖగోళశాస్త్రవేత్తగా నిలిచారు.

Image copyright CERN/SCIENCE PHOTO LIBRARY
చిత్రం శీర్షిక ఫాబియోలా గియోనాటి

ఫాబియోలా గియోనాటి, ఇటలీ కణభౌతిక శాస్త్రవేత్త

జన్మస్థలం: 1960లో రోమ్‌లో పుట్టారు

విద్య: మిలన్ యూనివర్సిటీలో ప్రయోగాత్మక కణభౌతికశాస్త్రం అభ్యసించారు

ఘనత: యూరోపియన్ ఫిజిక్స్ ఆర్గనైజేషన్ సెర్న్‌కు సారథ్యం వహించిన 16వ వ్యక్తి ఆమె. విశ్వం గురించి మన అవగాహనను పెంపొందించుకోవటానికి ప్రరపంచంలోనే అతిపెద్ద కణభౌతికశాస్త్ర పరిశోధనశాల పరిశోధనలు నిర్వహిస్తుంది.

శాస్త్ర రంగంలో విజయాలు: ఆమె 1994లో సెర్న్‌లో చేరారు. ప్రకృతిలో నిర్మాణ చట్రాలకు పదార్థాన్ని అందించే ఉప-పరమాణువు అయిన ‘హిగ్స్’ను గుర్తించిన అట్లాస్ ప్రయోగం మీద ఆమె పనిచేశారు. ఇప్పుడు ఆమె.. 100 దేశాలకు చెందిన 10,000 మందికి పైగా శాస్త్రవేత్తలు గల ఈ సంస్థకు నేతృత్వం వహిస్తున్నారు.

Image copyright ROBIN SCAGELL/SCIENCE PHOTO LIBRARY
చిత్రం శీర్షిక జోసలిన్ బెల్ బర్నెల్

జోసలిన్ బెల్ బర్నెల్, బ్రిటిష్ ఖగోళభౌతికశాస్త్రవేత్త

జన్మస్థలం: ఉత్తర ఐర్లండ్‌లోని లుర్గాన్‌లో 1943లో జన్మించారు

విద్య: యార్క్, గ్లాస్గో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల్లో చదువుకున్నారు

ఘనత: పల్సర్స్ - అణుధార్మిక కిరణాన్ని విడుదల చేసే ఒకరకం న్యూట్రాన్ స్టార్ -ను కనిపెట్టారు

శాస్త్ర రంగంలో విజయాలు: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని కావెండిష్ లాబొరేటిరీలో పరిశోధన విద్యార్థిగా ఉన్నపుడు.. ఆమె సాయంతో నిర్మించిన ఒక కొత్త రేడియో టెలిస్కోప్ సేకరించిన సమాచారాన్ని ఆమె పరిశీలిస్తున్నారు. అందులో లీలగా కనిపిస్తున్న అసాధారణ సంకేతాన్ని గుర్తించారు. అవి పునరావృతమవుతున్న రేడియో తరంగాల స్పందనలు. తన పర్యవేక్షకుడు ఆంటోని హెవిష్‌తో కలిసి ఆమె నిర్వహించిన పరిశోధనలను.. 20వ శతాబ్దంలో అతిగొప్ప అంతరిక్ష ఆవిష్కరణల్లో ఒకటిగా పరిగణిస్తారు. ‘‘పల్సర్స్‌ను కనిపెట్టటంలో నిర్ణయాత్మక పాత్ర’’కు గాను హెవిష్‌కు 1974లో ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి లభించింది. కానీ నోబెల్ పురస్కార పత్రంలో ఆమె పేరును చేర్చలేదు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపరిశోధనపై ఆసక్తి ఉందా..! ఈ 'స్కాలర్‌షిప్’మీ కోసమే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ అంశం ప్రభావం చూపుతుందా

'అతడి నీడ పడిన చోట మృత్యువు కాటేస్తుంది'.. బాలీవుడ్ సినిమాపై పొరుగు దేశంలో ఆగ్రహం

హైదరాబాద్ ఎన్‌కౌంటర్ మృతుల్లో ఇద్దరు మైనర్లని చెప్తున్న 'బోనఫైడ్' సర్టిఫికెట్లు.. ఎన్‌హెచ్‌ఆర్సీకి అందించిన కుటుంబ సభ్యులు

మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్‌ ప్రశ్న, సమాధానం ఏంటి

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీ హక్కుల పోరాట సమితి

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం