క్వీన్ నేని: ఆమెను గెలవలేక బ్రిటిషర్లు చేతులెత్తేశారు

  • 12 అక్టోబర్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionక్వీన్ నేని: ఆమెను గెలవలేక బ్రిటిషర్లు చేతులెత్తేశారు

ఆఫ్రికా ముఖ చిత్రాన్ని మార్చిన ధీర వనితల్లో క్వీన్ నేని ఒకరు. ఎన్నో ఏళ్ల పాటు ఆమెతో, ఆమె సముదాయంతో పోరాడిన బ్రిటిషర్లు... గెలవడం అసాధ్యం అని గ్రహించి శాంతి ఒప్పందం చేసుకున్నారు.

స్వేచ్ఛతో పాటు భూముల్నీ వాళ్లకు తిరిగిచ్చేశారు. 17వ శతాబ్దం నాటి మాట ఇది. 1680ల్లో క్వీన్ నేని... ఇప్పటి ఘనా దేశంలో పుట్టిందని చెబుతారు. ఆ తరువాత ఆమెను బానిసగా జమైకాకు తీసుకొచ్చారు.

ఆమె 'మరూన్‌'ల బృందంలో సభ్యురాలు. బ్రిటిష్ తోటల్లో బానిసత్వం నుంచి తప్పించుకున్నవాళ్లే ఈ మరూన్లు. వాళ్లంతా పర్వతాల్లోకి పారిపోయి అక్కడే తమ సముదాయాల్ని విస్తరించారు. క్రమంగా నేని ఆ మరూన్ల సముదాయానికి నాయకురాలిగా మారింది. తన మనుషులకు గెరిల్లా యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చింది.

ఎన్నో ఏళ్ల పాటు బ్రిటిషర్లు మరూన్లతో పోరాడారు. కానీ, పర్వత ప్రాంతాలను మరూన్లు తమకు అనువుగా మార్చుకుని పోరాడేవారు. మరూన్లను జయించడం సాధ్యం కాదని 1740 నాటికి జమైకాలోని బ్రిటిష్ ప్రభుత్వం గ్రహించింది. దాంతో, మరూన్లతో శాంతి ఒప్పందం చేసుకొని వాళ్లకు స్వేచ్ఛను, భూములను ప్రసాదించింది.

నేని మరణానంతరం ఆమెను జమైకా జాతీయ హీరోగా కొనియాడారు. ప్రస్తుతం జమైకా 500 డాలర్ల నోటు మీద నేని చిత్రం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)