రంగుల్లో మొదటి ప్రపంచ యుద్ధం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మొదటి ప్రపంచ యుద్ధాన్ని రంగుల్లో చూడండి...

  • 13 అక్టోబర్ 2018

మానవాళి చూసిన భయంకరమైన పోరాటాలలో మొదటి ప్రపంచ యుద్ధం ఒకటి. ఎన్నో లక్షల మంది సైనికుల ఈ యుద్ధంలో తమ ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఆ యుద్ధానికి సంబంధించిన అరుదైన మూకీ బ్లాక్ అండ్ వైట్ దృశ్యాలు లండన్‌లోని ఇంపీరియల్ వార్ మ్యూజియంలో భద్రపరిచారు. ఇపుడు ఆ దృశ్యాలకు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రంగులతో జీవం పోశారు.

హాలీవుడ్‌లో లార్డ్ అఫ్ ది రింగ్స్ లాంటి అద్భుతమైన గ్రాఫిక్స్ చిత్రాలు రూపొందించి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ పీటర్ జాక్సన్ మొదటి ప్రపంచ యుద్ధాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతానికి బ్రిటన్‌లో విద్యార్థులు కోసం ప్రదర్శించబోయే ఈ చిత్రంలోని హైలైట్స్ ఒక సారి చూడండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)