ఫిలిప్పీన్స్ జీన్ బ్యాంక్: లక్షలాది వరి వంగడాలకు నిలయం

  • 17 అక్టోబర్ 2018
వరి సాగు Image copyright Getty Images
చిత్రం శీర్షిక వరి ఉత్పత్తి, వినియోగం ఆసియాలోనే అత్యధికంగా ఉంది

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా లక్షలాది రకాల వరి వంగడాలను పరిరక్షిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వరదలు, కరవు పరిస్థితులను ఎదుర్కొనే విధంగా రైతులకు సహాయపడేందుకు ఫిలిప్పీన్స్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద రైస్ జన్యు బ్యాంకులో ఈ వరి వంగడాలను నిల్వ ఉంచినట్లు తెలిపారు.

ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ (ఐఆర్ఆర్ఐ)లోని ఈ జన్యు బ్యాంకుకు క్రాప్ ట్రస్ట్ సంస్థ నిధులు అందిస్తోంది.

భూతాపం పెరుగుతున్న తరుణంలో ఆహారోత్పత్తులకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఇలా జన్యు బ్యాంకుల్లో విత్తనాలను నిల్వ చేస్తున్నారు.

'ఈ విత్తనాలు అద్భుతం. సహజ ఆవరణలో లభించే అన్ని రకాల వరి వంగడాలను మీరు ఇక్కడ చూడొచ్చు' అని క్రాప్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియా హెగా అన్నారు.

వరి వంగడాలను చాలా సులభంగా నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా వందల ఏళ్ల నుంచి ఇవి నిల్వలు ఉన్నాయని చెప్పారు.

వరిలో జన్యు వైవిధ్యం ఉంటుంది. దాన్ని ఉపయోగించి కొత్త వంగడాలను సృష్టించవచ్చు. వరదల, కరవు పరిస్థితులను తట్టుకునేలా ఎరువులు ఉపయోగం పెద్దగా లేని కొత్త రకం విత్తనాలను తీసుకురావొచ్చు.

Image copyright Getty Images

బియ్యం - వాస్తవాలు

ప్రపంచంలోని మొత్తం ఆహార కేలరీల వినియోగంలో వరి వినియోగం 20 శాతంగా ఉంది.

వరి ఉత్పత్తి, వినియోగంలో 90 శాతం ఆసియాలోని ఆరు దేశాల (చైనా, ఇండియా, ఇండోనేసియా, బంగ్లాదేశ్, వియత్నాం, జపాన్) నుంచే ఉంది.

2050 నాటికి వరి వార్షిక వినియోగం 420 మిలియన్ టన్నుల నుంచి 525 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా.

జన్యు పరివర్తన ద్వారా గతంలో 'స్కూబా రైస్‌'ను ఐఆర్ఆర్ఐ సృష్టించింది. ప్రస్తుతం ఈ వంగడాలతో ఆఫ్రికాలో కూడా సాగు చేస్తున్నారు.

Image copyright IRRI
చిత్రం శీర్షిక జన్యు బ్యాంక్‌లోని అన్ని రకాల వరి వంగడాలను ప్రత్యేక వాతావరణంలో నిల్వ ఉంచుతారు

'వరి వంగడాలను నిల్వ ఉంచడం వల్ల ప్రపంచం లాభపడినట్లు ఎన్నోసార్లు రుజువైంది' అని ఈ జన్యుబ్యాంక్‌ను నిర్వహిస్తోన్న జీవశాస్త్రవేత్త రురాయిడ్ సాక్విల్లె- హమిల్టన్ చెప్పారు.

''నిల్వ ఉంచిన ఈ వంగడాలను పరిరక్షిస్తే కొత్త వండగాలను అభివృద్ధి చేయొచ్చు. ఆహార ఉత్పత్తుల్లో వచ్చే సవాళ్లను రైతులు ఎదుర్కొనేలా సహాయపడొచ్చు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త రకాలను తీసుకురావొచ్చు'' అని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)