వృద్ధాప్యం ఎందుకొస్తుంది? ఇవిగో... 9 కారణాలు

వయసు మీదపడుతున్న కొద్దీ మన శరీరంలోని వ్యవస్థల పనితీరులో అనేక మార్పులు జరుగుతుంటాయి.
ఆ విషయాలపై సుదీర్ఘ కాలంపాటు జరిపిన పరిశోధనలో వెల్లడైన అంశాలను "సైన్స్ ఆఫ్ ఏజింగ్" పేరుతో విడుదల చేసిన పత్రాల్లో శాస్త్రవేత్తలు వివరించారు. వృద్ధాప్యం పెరిగే క్రమంలో మన శరీరంలో జరిగే ప్రధానమైన ప్రక్రియల గురించి సవివరంగా చెప్పారు.
ఆ మార్పులు ప్రతి వ్యక్తిలోనూ తప్పనిసరిగా జరుగుతాయని స్పెయిన్లోని కేన్సర్ పరిశోధనా కేంద్రానికి చెందిన పరిశోధకులు డాక్టర్ సెర్రానో తెలిపారు. కాకపోతే, మన జీవన విధానం, జన్యు సంబంధమైన కారణాల వల్ల కొందరిలో కాస్త ముందుగా, మరికొందరిలో కాస్త ఆలస్యంగా జరుగొచ్చని ఆయన వివరించారు.
మనుషులతో సహా క్షీరదాల్లో వృద్ధాప్యాన్ని సూచించే 9 మార్పులు
1. డీఎన్ఏలో మార్పులు
డీఎన్ఏ మన శరీరంలోని కణాల మధ్య సమాచారాన్ని చేరవేసే కోడ్ లాంటిది.
అయితే, వయసు పెరిగే కొద్దీ ఆ సమాచార మార్పిడిలో పొరపాట్లు పెరుగుతాయి. ఆ "తప్పులన్నీ" కణాల్లో పేరుకుపోయి ఉంటాయి. దాన్ని జన్యుపరమైన అస్థిరత (జీనోమిక్ ఇన్స్టెబిలిటీ) అంటారు.
అలా డీఎన్ఏ చెడిపోవడం వల్ల మూల కణాల పనితీరుపై ప్రభావం పడుతుంది. దాంతో కణాల పునరుద్ధరణ ప్రక్రియ దెబ్బ తింటుంది.
- రోహిత్ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?
- BBC Special: భారత బీచ్లలో అణు ఇంధనం... అందాలంటే 30 ఏళ్లు ఆగాలి
2. క్రోమోజోమ్లు అరిగిపోతాయి
ప్రతి క్రోమోజోమ్ చివర టెలోమెరెస్ అనే రక్షణ కవచం ఉంటుంది. అయితే, వయసు మీద పడే కొద్దీ ఆ కవచాలు అరిగిపోతాయి. దాంతో క్రోమోజోమ్లకు రక్షణ లేకుండా పోతుంది.
అది వృద్ధాప్యం రావడంపై ప్రభావం చూపుతుంది.
పల్మనరీ ఫైబ్రోసిస్, అప్లాస్టిక్ అనీమియా లాంటి జబ్బులకు క్రోమోజోమ్ల రక్షణ కవచాలు అరిగిపోవడానికి మధ్య సంబంధం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఆ జబ్బుల వల్ల కణాలు పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోతాయి.
3. కణాల ప్రవర్తనలో మార్పు
మన శరీరం కొన్ని బాహ్యజన్యు (ఇపీజెనిటిక్) ప్రక్రియలను అభివృద్ధి చేస్తుంది. డీఎన్ఏ అమరిక ఎలా ఉండాలన్నది ఆ ప్రక్రియలో నిర్దేశించబడుతుంది.
శరీరంలోని ఏ కణం ఎలా ప్రవర్తించాలో ఆదేశాలు వెళ్తాయి.
అయితే, వయసులో పెరుగుదల, జీవన విధానం కారణంగా ఈ ప్రక్రియ సజావుగా సాగదు. దాంతో కణాలకు తప్పుడు ఆదేశాలు వెళ్తుంటాయి. అప్పుడు ఆ కణాలు అవసరమైన విధంగా కాకుండా మరోలా ప్రవర్తిస్తాయి.
- అమెరికా వర్సెస్ రష్యా: ‘అణు యుద్ధ నివారణ ఒప్పందం’ నుంచి వైదొలుగుతామన్న ట్రంప్.. హెచ్చరించిన గోర్బచెవ్
- దేవదాసి సీతవ్వ: 3600 మంది మహిళలను కాపాడిన ‘మాస్’ లీడర్
4. కణాల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది
కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేందుకు అనువుగా మృత కణాలను ఎప్పటికప్పుడు బయటకు పంపే సామర్థ్యం మన శరీరానికి ఉంటుంది.
అయితే, వయసు పెరిగే కొద్దీ ఆ సామర్థ్యం తగ్గుతుంది. దాంతో మృతకణాలు అలాగే శరీరంలోనే ఉండిపోయి అల్జీమర్స్, పార్కిన్సన్స్, కళ్లల్లో పొరలు వంటి రుగ్మతలకు దారితీస్తాయి.
5. కణాల జీవక్రియ నియంత్రణ తగ్గుతుంది
ఏళ్లు గడిచే కొద్ది కొవ్వులు, చక్కెర లాంటి పదార్థాలను ప్రాసెస్ చేసే సామర్ధ్యాన్ని కణాలు కోల్పోతాయి.
దాంతో పోషకాలను కణాలు సరిగా జీర్ణం చేసుకోలేవు.
ఇలాంటి పరిస్థితులే మధుమేహం లాంటి జబ్బులకు దారితీస్తాయి.
- ఆన్లైన్ షాపింగ్: వ్యాపారుల నకిలీ రివ్యూలు.. పూర్తిగా నమ్మితే అంతే సంగతులు
- ఆదిపరాశక్తి ఆలయం: ఇక్కడ రుతుస్రావం అపవిత్రం కాదు.. పీరియడ్స్ సమయంలోనూ పూజలు చేయొచ్చు
6. మైటోకాండ్రియా పని ఆపేస్తుంది
శరీరంలోని కణాలకు మైటోకాండ్రియా శక్తిని అందిస్తుంది. కానీ, వయసు పెరిగే కొద్దీ వాటిలో క్రియాశీలత తగ్గుతూ వస్తుంది.
అలా మైటోకాండ్రియా పూర్తిగా పనిచేయడం ఆగిపోనిప్పుడు వల్ల డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
మైటోకాండ్రియాను బాగు చేయగలిగితే క్షీరదాల జీవిత కాలాన్ని పెంచొచ్చని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.
7. కణాలు జాంబీలుగా మారతాయి
ఒక కణం బాగా దెబ్బతిన్నప్పుడు అపరిపక్వ కణాలు పుట్టుకను అడ్డుకునే పనిని ఆపేస్తుంది. అదే సమయంలో ఆ కణం వయసు పెరిగిపోతుంది.
ఆ క్రమంలో అది ఇతర కణాల నాశనానికి కూడా కారణమవుతుంది.
8. మూల కణాలకు నీరసం
కణాల పునరుత్పాదన సామర్థ్యం తగ్గుదల అనేది వృద్ధాప్యానికి ప్రధానమైన లక్షణంగా చెబుతారు.
వయసు మీదపడుతున్న కొద్దీ మూల కణాలు బలహీనపడి కణాల పునరుత్పాదనలో విఫలమవుతాయి.
మూలకణాలను పునరుద్ధరించడం ద్వారా త్వరగా వృద్ధాప్యం రాకుండా చేసే వీలుంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
9. కణాల మధ్య సమాచార మార్పిడి ఆగిపోతుంది
మన శరీరంలోని కణాల మధ్య నిత్యం సమాచార మార్పిడి జరుగుతుంది. అయితే, ఏళ్లు గడిచే కొద్దీ ఆ సమాచారం అందిపుచ్చుకునే సామర్ధ్యం తగ్గుతుంది.
అది నొప్పికి దారితీస్తుంది. దాంతో కణాల మధ్య సమాచార మార్పిడి ఆగుతుంది.
సమాచార మార్పిడి జరగడం లేదంటే వాటి ప్రవర్తన, పనితీరులోనూ తేడాలు వస్తాయి.
వృద్ధాప్యాన్ని ఆపొచ్చా?
ఈ 9 సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలిగితే వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసేలా ముందడుగు వేసేందుకు అవకాశం ఉంటుందని పరిశోధకుడు డాక్టర్. సెర్రానో అంటున్నారు.
ఆరోగ్యకరమైన జీవన విధానంతో కొంతమేరకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అన్నారు.
"గడచిన దశాబ్దాల కంటే ప్రస్తుతం వృద్ధాప్యంలో ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాం. భవిష్యత్తు ఇంకా మెరుగుపడే అవకాశం ఉంటుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- యూరిన్ థెరపీ: వాళ్ల మూత్రం వాళ్లే తాగుతున్నారు. మంచిదేనా?
- చాక్లెట్ అంతం: ప్రపంచ ఉత్పత్తిలో సగం తినేస్తున్న యూరప్, అమెరికా ప్రజలు
- మనం సగం మనుషులమే! మన శరీరంలో సగానికి పైగా సూక్ష్మజీవులే!!
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- రోహిత్ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?
- ఫేక్ మూన్: చైనా చంద్రుడు వెలుగులు పంచగలడా?
- ఆరోగ్యం: ప్రజలంతా స్మార్ట్ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది?
- శబరిమల: అయ్యప్ప దర్శనానికి ముందు భక్తులు మసీదుకు ఎందుకు వెళ్తారు?
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- BBC Special: భారత బీచ్లలో అణు ఇంధనం.. అందుకోవాలంటే 30 ఏళ్లు ఆగాలి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)