మలేరియా: దోమలపై దోమలతో యుద్ధం... ఆఫ్రికాలో సరికొత్త ప్రయత్నాలు

  • 22 అక్టోబర్ 2018
దోమ Image copyright SPL

తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాణాంతక మలేరియా బారిన పడి ఏటా అనేక మంది చనిపోతుంటారు. ఆసియా, ఆఫ్రికా, మధ్య-దక్షిణ అమెరికాల్లో మలేరియా ఒక పెద్ద సమస్య.

ఆఫ్రికాలో మలేరియా మహమ్మారిని తరిమికొట్టేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. బుర్కినా ఫాసోలోని ఓ గ్రామంలో మలేరియాను వ్యాప్తి చేసే దోమల్ని తరిమికొట్టడమే లక్ష్యంగా జన్యుపరివర్తనం చేసిన వేల దోమలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి ప్రయోగం చెయ్యడం ఇదే మొదటిసారి.

ఈ దోమలు మలేరియాను అడ్డుకోలేవు. కానీ జన్యుపరివర్తనం చేసిన ఈ దోమలు అక్కడున్న దోమల్లో సంతానోత్పత్తిని నిరోధించడంలో సాయపడతాయి.

Image copyright Science Photo Library

''జీన్ డ్రైవ్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని మేం ఉపయోగిస్తాం. జన్యు పరివర్తన ద్వారా క్రమంగా మొత్తం దోమల సంఖ్యను తగ్గిస్తూ మలేరియా వ్యాప్తిని నిరోధిస్తాం'' అని బ్రిటన్‌లో లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన డాక్టర్ అలెకోస్ సైమొని చెప్పారు.

మలేరియా కారణంగా 2016లో ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల 45 వేల మంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: దోమలపై దోమలతో యుద్ధం

జన్యు పరివర్తన ద్వారా ప్రతికూల ఫలితాలు రావచ్చని కొందరు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అలెకోస్ సైమొని స్పందిస్తూ- ''ఈ సాంకేతిక పరిజ్ఞానం కేవలం ప్రభావవంతమైనదే కాదు, సురక్షితమైనది కూడా అన్న విశ్వాసం కలిగిన తర్వాతే మేం ఈ దోమల్ని విడుదల చేస్తాం'' అని అలెకోస్ సైమొని తెలిపారు.

(వీడియోలోని ఫొటోలు: 'టార్గెట్ మలేరియా' నుంచి...)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు