ఎల్జీబీటీ: స్వలింగ సంపర్కానికి, వేళ్ల పొడవుకు సంబంధం ఉందా?

  • 23 అక్టోబర్ 2018
వేళ్లు చూపిస్తున్న అమ్మాయి Image copyright Getty Images

ఎడమ చేతి చూపుడు వేలు, ఉంగరపు వేలు పొడవు మధ్య వ్యత్యాసం ఉండే మహిళలు స్వలింగ సంపర్కులు అయ్యుండే అవకాశం ఎక్కువని ఒక అధ్యయనం తెలిపింది.

ఒకేలా ఉండే 18 ఆడ కవల జంటల(36 మంది)పై బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. ప్రతి జంటలో ఒకరు స్ట్రైట్ కాగా, మరొకరు హోమో సెక్సువల్.

సగటు ప్రకారం చూస్తే- ఈ జంటల్లో స్వలింగ సంపర్కులైన మహిళల ఎడమ చేతి చూపుడు వేలు, ఉంగరపు వేలు(నాలుగో వేలు) పొడవు మధ్య వ్యత్యాసం ఉంది.

Image copyright Getty Images

14 మగ కవల జంటల(28 మంది)పైనా పరిశోధకులు అధ్యయనం జరిపారు. ప్రతి జంటలో ఒకరు స్ట్రైట్ కాగా, మరొకరు స్వలింగ సంపర్కులు. వీరిలో చూపుడు వేలు, ఉంగరపు వేలు పొడవు మధ్య తేడాకు, లైంగికతకు మధ్య సంబంధం కనిపించలేదు.

సాధారణంగా మహిళల్లో ఈ రెండు వేళ్ల పొడవు దాదాపు సమానంగా ఉంటుంది. పురుషుల్లో రెండింటి పొడవు మధ్య గణనీయమైన తేడా ఉంటుంది.

తల్లి గర్భంలో ఉన్నప్పుడు పురుష హార్మోన్‌గా పిలిచే టెస్టోస్టిరాన్ ప్రభావానికి ఎక్కువగా లోనవడం వల్ల చూపుడు వేలు, ఉంగరపు వేలు పొడవు మధ్య వ్యత్యాసం ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.

తల్లి కడుపులో ఉన్నప్పుడు టెస్టోస్టిరాన్ ప్రభావానికి అందరూ లోనవుతారని, అయితే కొందరు ఈ ప్రభావానికి ఎక్కువగా లోనవుతారని వారు తెలిపారు.

కవలలు ఒకేలా ఉన్నా వారిద్దరి లైంగికత భిన్నంగా ఉండొచ్చని, జన్యువులే కాకుండా ఇతర అంశాలు ఇందుకు కారణం కావొచ్చని ఎసెక్స్ విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగానికి చెందిన అధ్యయనకర్త డాక్టర్ ట్యూస్‌డే వాట్స్ చెప్పారు.

''లైంగికత తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిర్ణయమవుతుందని, టెస్టోస్టిరాన్ స్థాయి, ఈ హార్మోన్‌కు శరీరం స్పందించే విధానాన్ని బట్టి ఇది ఉంటుందని మా పరిశోధన చెబుతోంది. అధిక స్థాయిలో టెస్టోస్టిరాన్ ప్రభావానికి లోనయ్యేవారు హోమోసెక్సువల్ లేదా బైసెక్సువల్ అయ్యే అవకాశముంది'' అని ట్యూస్‌డే వాట్స్ వివరించారు.

అధ్యయనం వివరాలు 'ఆర్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్‌'లో ప్రచురితమయ్యాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలో వ‌రుస పడవ ప్ర‌మాదాలు... ఎందుకిలా జ‌ర‌ుగుతోంది? ఎవరు బాధ్యులు?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

కశ్మీర్: పీఎస్ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?

దక్షిణ కొరియా నాయకులు ఎందుకు గుండు కొట్టించుకుంటున్నారు?

ధోనీ మళ్లీ ఆడతాడా... భారత క్రికెట్‌కు అతడి అవసరం ఇంకా ఉందా?

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'..

గుజరాత్ 2002 అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా.. వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు