వెనెజ్వేలా: పోషించే శక్తి లేక పిల్లల్ని అమ్మేస్తున్నారు

  • 25 అక్టోబర్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవెనెజ్వేలా: పోషించే శక్తి లేక పిల్లల్ని అమ్మేస్తున్నారు

వెనెజ్వేలా ఆర్థిక సంక్షోభం అక్కడి తల్లుల పాలిట శాపంగా మారింది. పిల్లల్ని పోషించే శక్తిలేక అక్కడ చాలామంది తల్లులు వారిని అమ్మేస్తున్నారు. ఇంకొందరు వీధుల్లో వదిలేస్తున్నారు.

వెనెజ్వేలా ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలామంది ప్రజలు కనీస అవసరాలను తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆహారం ఖరీదైన విషయంలా మారిపోయింది. వేలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆ ఆకలి తల్లీబిడ్డలను కూడా వేరు చేస్తోంది.

పుట్టగానే బిడ్డలను ఇతరులకు ఇచ్చేస్తున్నవాళ్లు, అమ్ముకుంటున్నవాళ్లు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో చాలామంది పిల్లలు వీధుల పాలవుతున్నారు. కొందరు సంక్షేమ గృహాలకు చేరుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఎన్జీవోలు చెబుతున్నాయి.

తాము బయటికొస్తే ఇంట్లో చిన్నవాళ్లకైనా ఆహారం దొరుకుతుందని కొందరు స్వచ్ఛందంగా ఇల్లొదిలి వచ్చేస్తున్నారు.

మరిన్ని వివరాలు పై వీడియోలో..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు