నటుడు డి నీరో రెస్టారెంట్ వద్ద అనుమానాస్పద ప్యాకేజ్

  • 25 అక్టోబర్ 2018
రాబర్ట్ డి నీరో Image copyright Getty Images

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు పంపిన అనుమానిత పేలుడు పదార్థాల పార్సిల్ లాంటిదే నటుడు రాబర్ట్ డి నీరో రెస్టారెంట్‌కూ పంపారు.

ఈ రోజు ఉదయమే ఈ పార్సిల్ వచ్చిందని ఎన్‌బీసీ తెలిపింది. అయితే పార్సిల్ అందినపుడు ట్రెబెకా గ్రిల్ ఖాళీగా ఉందని న్యూయార్క్ పోలీసులు తెలిపారు.

డి నీరో ట్రంప్ విధానాలకు తీవ్ర వ్యతిరేకి.

ఇటీవలే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కూ అనుమానిత పేలుడు పదార్థాల పార్సిళ్లను పంపారు.

Image copyright Getty Images

రెండు రోజుల కిందట న్యూయార్క్ నగర శివారుల్లో ఫిలాంత్రోఫిస్ట్ జార్జ్ సోరోస్ ఇంటి వద్ద బాంబు దొరికిన నేపథ్యంలో ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

అమెరికా 'మాజీ'లకు పంపిన పార్శిళ్లను తనిఖీ చేసినపుడు అనుమానిత పదార్థాలు గుర్తించారు.

ఇప్పటివరకు ట్రంప్ వ్యతిరేకులు ఏడుగురికి ఇలాంటి పార్సిళ్లు అందాయి.

అయితే ఈ పార్శిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఇంకా తెలియలేదు.

Image copyright Getty Images

అమెరికా నిఘా, రహస్య విభాగం పంపిన ప్రకటన ప్రకారం.. ఈ నెల 23న సాయంత్రం హిల్లరీకి పంపిన పార్శిల్‌ను మొదట గుర్తించారు.

బుధవారం తెల్లవారుజామున ఒబామాకు పంపిన పార్శిల్ వెలుగులోకి వచ్చింది.

ఈ పార్శిళ్లలో పేలేందుకు అవకాశమున్న పరికరాలను గుర్తించామని సీక్రెట్ సర్వీస్ అధికారులు చెప్పారు.

ఎఫ్‌బీఐ అధికారులు మాట్లాడుతూ.. తమకూ ఈ అనుమానిత పార్శిళ్ల సమాచారం అందిందని.. దర్యాప్తు అధికారులకు తాము సహకారం అందిస్తున్నామని చెప్పారు.

అయితే దీనిపై మాట్లాడేందుకు ఒబామా అధికార ప్రతినిధి నిరాకరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

ట్రంప్ పదవి ఊడుతుందా.. అసలు అభిశంసన అంటే ఏంటి

‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్

World Kindness Day: ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు

అయోధ్య తీర్పు: ‘తప్పు చేసిన దోషికే బహుమతి ఇచ్చారు’ - జస్టిస్ లిబర్హాన్ కమిషన్ న్యాయవాది అనుపమ్ గుప్తా

ట్రంప్‌పై పోటీచేయాలనే ఒత్తిడి వస్తోంది: హిల్లరీ క్లింటన్

ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం

సాంబార్ సరస్సు తీరంలో వెయ్యికి పైగా పక్షుల మృతికి కారణాలేమిటి

తాలిబన్ల వద్ద బందీలైన ప్రొఫెసర్ల విడుదలకు మిలిటెంట్లను విడిచిపెట్టనున్న అఫ్గానిస్తాన్