‘అమ్మా... అందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతారు?’

వీడియో క్యాప్షన్,

అమ్మా... అందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతారు?

‘అమ్మా... నన్ను చూసి ఎందుకు నవ్వుతారు? చిన్నప్పట్నుంచీ కొన్ని వందల సార్లు మా అమ్మను ఈ ప్రశ్న అడిగాను. దానికి ఆమె దగ్గర సమాధానం లేదు. అందుకే పాట పాడి నన్ను వారించేది’ అంటోంది కెన్యాకు చెందిన ఏంజెల్ వంజీరు అనే 14ఏళ్ల అమ్మాయి.

ఆమెకు పుట్టుకతోనే కాంజెనైటల్ హైడ్రోసెఫాలస్ వ్యాధి ఉంది. అందుకే, ఇతరుల తల కంటే ఆమె తల చాలా పెద్దదిగా ఉంటుంది.

అయినా ఆ అమ్మాయి కుంగిపోకుండా 12 ఏళ్ల వయసులోనే సంగీతంలో కెరీర్ మొదలుపెట్టింది.

‘నా రూపం నాకెప్పుడూ నచ్చేది కాదు. అందుకే మా అమ్మ ఐ లవ్‌ యూ, ఐ లవ్ యూ అని పదేపదే చెబుతూ ఉండేది. 2016లో నేను నా మొదటి పాటను విడుదల చేశాను. ‘ఐ వాంట్ టు నో' అనేది ఆ పాట పేరు. నేను మా అమ్మను చాలా ప్రశ్నలు అడిగేదాన్ని కదా... అందుకే ఆ పేరు పెట్టా.

'అమ్మా... నేనెందుకు ఇతరులకంటే భిన్నంగా ఉంటాను?' నేను వెళ్తుంటే ఎందుకు చాలామంది నన్ను చూసి నవ్వుతారు?' అని అడిగేదాన్ని. నా కోసం పాట పాడటం మినహా ఆమె దగ్గర సమాధానం ఉండేది కాదు.

కానీ, ఇప్పుడు అలాంటి వెక్కిరింతల్ని పట్టించుకోవడం మానేశా.

వైకల్యంతో బాధపడే పిల్లలు... వాస్తవాన్ని గ్రహించి తమను తాముగా స్వీకరించాలి. ఇతరులు నవ్వినా వాళ్ల గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే, మనుషుల్ని సృష్టించింది మనుషులు కాదు... దేవుడు. కాబట్టి, మిమ్మల్ని మీరు స్వీకరించండి. ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోకండి’ అంటూ తన మాటతో పాటు పాటతోనూ ఇతరుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది ఏంజెల్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)