వీడియో: అరటి పండు అంతరించిపోనుందా?

వీడియో: అరటి పండు అంతరించిపోనుందా?

అరటి పండ్లు అంటే ఇష్టపడనివారంటూ ఉండరు. కానీ, ప్రపంచమంతా దొరికే ఈ పండు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది.

అరటి కుదుళ్లను నాశనం చేసే పనామా వ్యాధితో తోటలన్నీ నాశనమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, చైనా, ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి తన ప్రభావాన్ని చూపుతోంది. భారత్‌లోని తోటలపైనా ప్రభావం పడింది.

ప్రపంచంలో అత్యధికంగా అరటిని ఎగుమతి చేసే లాటిన్ అమెరికా దేశాలపై ఈ వ్యాధి ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే అరటి పండు అంతరించిపోయే అవకాశం ఉందని పరిశోధకలు భయపడుతున్నారు.

ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు అరటి జన్యువును మార్చి వ్యాధులను తట్టుకునేలా ప్రయోగశాలల్లో అరటిని పెంచాలని ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)