బ్రెజిల్ అధ్యక్షునిగా జైర్ బోల్సోనారో

బ్రెజిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఎన్నికల్లో విజయం అనంతరం తన భార్యకు ముద్దుపెడుతున్న బొల్సనారో

బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో బోల్సనారో నేతృత్వంలోని మితవాద పార్టీ విజయం సాధించింది.

ఇప్పటికి ఇక్కడ ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. ఇందులో బోల్సనారో పార్టీకి 55 శాతం ఓట్లు రాగా.. ఫెర్నాండో హదాద్ నేతృత్వంలోని వామపక్షానికి 45 శాతం ఓట్లు వచ్చాయి.

బ్రెజిల్లో అవినీతిని అంతమొందిచి.. నేరాలను తగ్గిస్తానన్న హామీలతో బొల్సనారో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజల భద్రతకు తాను అధిక ప్రాధాన్యం ఇస్తానని వివరించారు. తుపాకులకు సంబంధించిన నిబంధనలనూ కొంచెం సరళిస్తానని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA

ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గిస్తానని.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు.

వాతావరణ మార్పులకు సంబంధించిన 2015 పారిస్ ఒప్పందం నుంచి తప్పకుంటామని.. ఈ ఒప్పందం వల్ల అమెజాన్ ప్రాంతంపై బ్రెజిల్‌కు ఉన్న అధికారాన్ని పణంగా పెట్టాల్సి వస్తుందని చెప్పారు.

ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ.. ప్రత్యర్థులకు అవకాశమిస్తే బ్రెజిల్‌ను నాశనం చేస్తారన్న వాదనను బొల్సనారో బలంగా తీసుకెళ్లారు.

బ్రెజిల్ సైనిక పాలనలో ఉందని బొల్సనారో విమర్శించగా.. అతనికి అధికారం ఇస్తే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP

అయితే తన పార్టీ గెలుపు అనంతరం బొల్సనారో మాట్లాడుతూ.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను రక్షిస్తానని చెప్పారు.

ఇది ఓ పార్టీ హామీ కాదని.. తాను దేవుడి ముందు చేస్తున్న ప్రమాణమని పేర్కొన్నారు.

బ్రెజిల్‌ను మళ్లీ గొప్ప దేశంగా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు.

మరోవైపు రియో డి జెనీరోలో బొల్సనారో మద్దతుదారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

తొలి విడత ఎన్నికల ప్రారంభానికి నెల రోజుల ముందే హదాద్ వామ పక్ష అధ్యక్ష అభ్యర్థిగా తెరపైకి వచ్చారు.

ఇదే పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు లులా ద సిల్వా అవినీతి కేసులో 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

బొల్సనారో జనవరి 1న తాను పదవీప్రమాణం చేస్తానని చెప్పారు. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు మిచెల్ టెమెర్ పదవి నుంచి వైదొలగుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)