బ్రెజిల్ ఎన్నికలు: జైర్ బోల్సోనారోను గెలిపించిన ‘తుపాకీ’
- బీబీసీ మానిటరింగ్
- మియామి

ఫొటో సోర్స్, Getty Images
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో జైర్ బోల్సోనారో విజయం సాధించారు. ఎన్నికలకు ముందు బోల్సోనారోపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనతో ఆయన ప్రచారానికి దూరమైనప్పటికీ, విజయం మాత్రం దూరం కాలేదు.
సెప్టెంబర్ 6న ఓ వ్యక్తి బోల్సోనారోపై దాడి చేసి, కత్తితో పొడిచాడు. ఈ దాడిలో గాయపడిన బోల్సోనారో హాస్పిటల్లో చికిత్స పొందుతూ, ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారు.
మొదటి దశ ఎన్నికల్లో అక్టోబర్ 7న విజయం సాధించినప్పటికీ టీవీ చర్చాకార్యక్రమాల్లో, ఇంటర్వ్యూల్లో ఎక్కడా ఆయన పాల్గొనలేదు.
‘నిజాయితీ గల పౌరుడికి తుపాకీ!’
బ్రెజిల్ పౌరులకు మరింత భద్రత కల్పించడం బోల్సోనారో మ్యానిఫెస్టోలో ప్రధానాంశం. బ్రెజిల్ వీధుల్లో తాను మాత్రమే శాంతిని తిరిగి స్థాపించగలనని ఆయన చెప్పారు.
తుపాకులను కలిగి ఉండటంపై ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను సడలిస్తానని ఆయన అన్నారు. ''నిజాయితీ కలిగిన బ్రెజిల్ పౌరులు తమ రక్షణ కోసం ఒక తుపాకిని కలిగివుండొచ్చు'' అని అక్టోబర్ 11న ఒక టీవీ ఇంటర్వ్యూలో అన్నారు.
అబార్షన్‌ను చట్టబద్ధం చేయడం కూడా బోల్సోనారో హామీల్లో మరొకటి.
ఫొటో సోర్స్, AFP
‘అందుకే ఓటు వేశాం..’
వామపక్ష పార్టీ ప్రభుత్వంలో బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ పతనమయ్యిందని అందుకే తాము బోల్సోనారోకు ఓటు వేశామని చాలా మంది చెప్పారు.
లాటిన్ అమెరికా దేశాల్లోని మితవాద ప్రభుత్వాల ఆర్థిక విధానలను పోలిన విధానాలనే బోల్సోనారో కూడా ప్రతిపాదించారు. ప్రభుత్వం చేసే వృథా ఖర్చును, ఆర్థిక రంగంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తామని చెబుతూనే, పరిశ్రమలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని కూడా అన్నారు.
''నా కేబినెట్లో మంత్రిత్వ శాఖలను కుదించి, ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలోని చాలా సంస్థలను ప్రైవేటీకరించడానికి కట్టుబడి ఉన్నాను'' అని బోల్సోనారో ట్వీట్ చేశారు.
ప్రభుత్వ చమురు సంస్థ పెట్రోబ్రాస్కు చెందిన రిటైల్, రవాణా, శుద్ధి, ఇతర రంగాల్లోని అధిక భాగాన్ని ప్రైవేటీకరించాలన్నారు.
ప్రైవేటీకరించడం ద్వారా పోటీ తత్వాన్ని ప్రోత్సహించాలని చెబుతూనే, చమురు సంస్థపై ప్రభుత్వ ఆధిపత్యం కొనసాగాలని అన్నారు.
బ్రెజీలియన్ ట్రంప్!
బ్రెజిల్ ప్రజలు బోల్సోనారోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పోలుస్తున్నారు. బోల్సోనారో ప్రతిపాదించిన విదేశాంగ విధానాలు, పర్యావరణ విధానాలు, మధ్యప్రాచ్య దేశాలతో విభేదాల అంశాలు.. చాలా వరకూ ట్రంప్ విధానాలతో పోలి ఉన్నాయి.
వాతావరణ విషయాల్లో ప్రపంచ దేశాల మధ్య కుదిరిన పారిస్ ఒప్పందం నుంచి బయటకు వస్తామన్నది కూడా బోల్సోనారో హామీల్లో ఒకటి.
ఈ ఒప్పందం కారణంగా అమెజాన్ ప్రాంతంపై అధికారం విషయంలో రాజీపడాల్సి వస్తోందన్నది ఆయన వాదన. ప్యారిస్ ఒప్పందం గురించిన బోల్సోనారో నిర్ణయానికి చాలా మంది భూయజమానులు, వ్యవసాయరంగ వ్యాపారులు మద్దతు తెలిపారు.
ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్‌లోని బ్రెజిల్ దౌత్య కార్యాలయాన్ని ప్రస్తుత స్థానం నుంచి జెరూసలెంకు మార్చే ఆలోచన పట్ల బోల్సోనారో సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.
బ్రెజిల్‌లోని పాలస్తీనా దౌత్య కార్యాలయాన్ని కూడా మూసివేస్తామని ఆయన అన్నారు.
''పాలస్తీనా ఒక దేశమా? కాదు. అలాంటపుడు ఇక్కడ పాలస్తీనా దౌత్య కార్యాలయం ఉండకూడదు'' అని ఆగస్టులో బోల్సోనారో అన్నారు.
ఎన్నికల్లో గెలిచాక, బ్రెజిల్ అధ్యక్షుడి హోదాలో మొదటగా పాలస్తీనాలో పర్యటిస్తానని బోల్సోనారో ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
- కంచ ఐలయ్య పుస్తకాలను సిలబస్ నుంచి ఎందుకు తొలగిస్తున్నారు?
- వీర్యం కావాలి... దాతల కోసం ఫేస్బుక్లో వెతుకుతున్న మహిళ
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- నమ్మకాలు - నిజాలు: అలర్జీలు ఆడవాళ్లకేనా?
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- ‘అమ్మా... అందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతారు?’
- అజంతా చిత్రాల అందాలకు శాపంగా మారిన కాలుష్యం
- ‘భారత్ నీళ్లను ఆయుధంలా ఉపయోగిస్తోంది’ - పాకిస్తాన్ ఆరోపణ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)