మాజీ ప్రధాని ఖలేదా జియాకు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన బంగ్లాదేశ్ కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక కోర్టు.. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నేత, మాజీ ప్రధాని ఖలేదా జియా, మరో ముగ్గురికి అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఆమెకు రూ. 8.6 లక్షల జరిమానా కూడా విధించారు. అది చెల్లించకపోతే ఆమె మరో ఆరునెలల పాటు జైలులో ఉండాల్సి వస్తుంది.
ఖలేదాపై ఏడేళ్ల క్రితం ఈ కేసు నమోదైంది.
ఖలేదా జియా ప్రస్తుతం మరో అవినీతి కేసులో ఐదేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు.
జియా ఛారిటబుల్ ట్రస్ట్ తరపున అవినీతికి పాల్పడ్డారంటూ 2011లో ఆమెపై కేసు నమోదైంది.
ఈ కేసులో ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడి, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సుమారు 26 లక్షలను తీసుకున్నారని ఆరోపించారు.
అయితే తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలని ఖలేదా అంటున్నారు.
తన కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచడానికే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)