భారత్ వర్సెస్ వెస్టిండీస్: 224 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం

నాలుగో వన్డే

ఫొటో సోర్స్, AFP

ముంబయ్‌లో జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండీస్ మీద బారత జట్టు 224 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ విజయంతో భారత జట్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో రెండో వన్డే ఉత్కంఠభరితంగా సాగి టైగా ముగిసిన సంగతి తెలిసిందే.

మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు మొదటి ఓవర్ నుంచే పరుగుల ప్రవాహాన్ని ప్రారంభించింది. రోహిత్ శర్మ, అంబటి రాయుడు ఇద్దరూ సెంచరీలు చేశారు. భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ జట్టు చతికిలపడింది. ఆ జట్టు 36.2 ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

వెస్టిండీస్ జట్టులో కెప్టెన్ జేసన్ హోల్డర్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

భారత బౌలర్లు ఖలీల్ అహ్మద్, కులదీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ పడగొట్టారు.

బౌలర్ల మీద విరుచుకుపడిన రోహిత్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

కేవలం 137 బంతుల్లో 164 పరుగులు చేసిన రోహిత్ శర్మ

రోహిత్ కేవలం 137 బంతుల్లోనే 162 పరుగులు చేశాడు. 20 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో రోహిత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇది రోహిత్‌కు 186వ వన్డే మ్యాచ్. ఈ మ్యాచ్‌తో 198 సిక్సర్లు కొట్టిన రోహిత్, 452 వన్డేలలో 195 సిక్సర్లు కొట్టిన సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.

అంబటి రాయుడు 81 బంతుల్లో 100 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)