ఆఫ్రికా చరిత్ర: పుస్తకాల్లో కనిపించని శక్తిమంతమైన మహారాణి

వీడియో క్యాప్షన్,

వీడియో: ఆఫ్రికా చరిత్ర పుస్తకాల్లో కనిపించని శక్తిమంతమైన మహారాణి

చరిత్ర పుస్తకాల్లో క్వీన్ దిహ్యా గురించి ఎక్కువగా కనిపించదు. ఆమె 7వ శతాబ్దంలో అల్జీరియాలో జీవించిందని చెబుతారు.

రోమన్ల సామ్రాజ్యం కూలిపోయాక, అల్జీరియాపై తొలి అరబ్ దండయాత్ర మొదలైన రోజుల్లో దిహ్యా పాత్ర కీలకంగా ఉండేది.

ఓ పక్క రోమన్, బైజాంటిన్ సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి. ఆ సమయంలో దిహ్యా పోరాటం వెలుగులోకి వచ్చింది. తన ప్రజల ఆత్మగౌరవానికి, ప్రతిఘటనలకు ఆమె ప్రతీకలా నిలిచారు.

ఆమెను బెర్బెర్ క్వీన్ అని పిలిచేవారు. ‘బెర్బెర్’ అనేది అల్జీరియాలో ఓ సమూహం. బెర్బెర్ ప్రజల చరిత్రలో దిహ్యాది కీలక స్థానం. ముస్లిం వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాడేలా ఆమె ప్రజలను నడిపించేవారు. తమ సమూహానికీ, సైన్యానికీ నాయకత్వం వహించేవారు.

ఆమె కథను అల్జీరియాలో భిన్న మతస్థులు భిన్న విధాలుగా చెప్పుకుంటారు. ఇటీవల అల్జీరియాలో ఓ గ్రాఫిటీ బొమ్మలో ఆమె చిత్రాన్ని ఉపయోగించారు. 2003లో అల్జీరియాలోని బాఘై నగరంలో దిహ్యా విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)