ఇరాన్ మీద ఆంక్షలను పునరుద్ధరించిన డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AFP
గత మే నెల నుంచే ఇరాన్ మీద ఆంక్షలను విధిస్తూ వచ్చిన డోనల్డ్ ట్రంప్
ఇరాన్‌తో 2015లో కుదుర్చుకున్న అణు ఒప్పందం సందర్భంగా తొలగించిన ఆంక్షలన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, ఇరాన్ నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్న ఎనిమిది దేశాల మీద ఎలాంటి చర్యలు ఉండవని కూడా తెలిపింది. అయితే, ఆ దేశాల పేర్లు మాత్రం వెల్లడి చేయలేదు.
ఇరాన్ అణు ఒప్పందం ప్రాథమికంగానే లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, దాని నుంచి తప్పుకుంటున్నట్లు గత మే నెలలో ప్రకటించారు.
ఆంక్షలను ఎత్తివేసినందుకు ప్రతిగా ఇరాన్ తన అణు కార్యకలాపాలను తగ్గించుకోవడమే ఆ ఒప్పందం లక్ష్యం. అప్పట్లో అమెరికా అధ్యక్షునిగా ఉన్న బరాక్ ఒబామా, ఈ ఒప్పందం వల్ల ఇరాన్ అణ్వస్త్రాల తయారీని నివారించినట్లవుతుందని వాదించారు.
బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా దేశాలు కూడా ఈ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి. అందులోని నిబంధనలకు కట్టుబడి ఉన్నాయి కూడా. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలను కొనసాగించేందుకు సరికొత్త చెల్లింపుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటామని ఆ దేశాలు ప్రకటించాయి.
అయితే, ఆ ఒప్పందం అంతా తప్పుల తడక అని, అది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడాన్ని ఆపలేకపోయిందని, సిరియా, యెమెన్ వంటి పొరుగు దేశాలలో దాని జోక్యాన్ని కూడా అడ్డుకోలేకపోయిందని ట్రంప్ అన్నారు.
అయితే, ట్రంప్ "మానసికపరమైన యుద్ధం" చేస్తున్నారని ఇరాన్ ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
- జమాల్ ఖషోగ్జీ హత్య: ‘మృతదేహాన్ని యాసిడ్‌లో వేసి కరిగించారు'
- నాటో బలగాల భారీ విన్యాసాలు... 31 దేశాలు, 50 వేల మంది సైనికులు
- యెమెన్ సంక్షోభం: వేల ఏళ్ళ ఘన చరిత్రను ఆకలికేకలతో వినిపిస్తున్న సనా నగరం
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- చరిత్ర: "నన్ను మీరు మభ్య పెట్టలేరు, నేను ఆయన శరీరంలో 34 బుల్లెట్లు దించాను"
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)