ఈజిప్ట్‌ తవ్వకాల్లో బయటపడిన పిల్లులు, పేడ పురుగుల మమ్మీలు

  • 19 నవంబర్ 2018
ఈజిప్టులో తవ్వకాలు జరిగిన ప్రాంతం Image copyright AFP

సాధారణంగా ఈజిప్టులో మనుషుల మమ్మీలు బయటపడతాయి. కానీ ఈసారి పిల్లులు, పేడపురుగుల మమ్మీలు బయటపడ్డాయి.

ఈజిప్ట్ రాజధాని కైరో సమీపంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కొన్ని పురాతన సమాధుల్లో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో పిల్లులు, పేడపురుగుల మమ్మీలు బయటపడ్డాయి.

ఈ మమ్మీలు 4 వేల సంవత్సరాలకు పైబడినవని పరిశోధనలో తేలింది. దక్షిణ కైరో వద్ద ఉన్న సకారలోని స్మశానంలో ఈ తవ్వకాలు జరిపారు. ఈ స్మశానవాటిక ఈజిప్ట్ రాజధాని మెమ్ఫిస్ నగరానికి చెందినది.

Image copyright Reuters

పిల్లులు, ఇతర జంతువులకు మరణానంతర జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రాచీన ఈజిప్షియన్లు విశ్వసించేవారు.

Image copyright AFP

ఒక సమాధిలో 'పిల్లుల దైవం'కు అంకితమిస్తూ తయారు చేసిన ఒక కంచు పిల్లి విగ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Image copyright AFP

పేడపురుగులకు కూడా ఒక మతపరమైన గుర్తింపు ఉండేది. ఈ జీవులు సూర్యదేవుని చిహ్నంగా భావించేవారు.

Image copyright Reuters

మనుషులు మరణించాక, వారి దేహాలను మమ్మీలలో భద్రపరుస్తారు. కానీ జంతువులను మమ్మీలలో భద్రపరచడం.. నైవేద్యం ఇవ్వడం లాంటిది.

Image copyright AFP

ఈజిప్ట్ రాజు యూసర్ కఫ్ పిరమిడ్ కాంప్లెక్స్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో 7 పేటికలు బయటపడ్డాయి. వీటిలో మూడింటిలో పిల్లుల మమ్మీలున్నాయి.

Image copyright Reuters
Image copyright Reuters

ఈ తవ్వకాల్లో, మరొక సమాధిలోకి వెళ్లే ఒక ద్వారాన్ని అధికారులు కనుగొన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ద్వారాన్ని తెరవాలని అధికారులు భావిస్తున్నారు.

Image copyright AFP

ఈ సమాధిలో పాక్షికంగానే తవ్వకాలు జరిగాయని, ఇంకా ఆ ప్రాంతంలో మరిన్ని తవ్వకాలు జరగాలని అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)