ఫేక్ న్యూస్ గురించి పిల్లలకు చెప్పడం ఎలా?

'ఫేక్ న్యూస్' లేదా నకిలీ వార్తలు అన్నవి ప్రస్తుతం భారత దేశంలో విస్తృత చర్చనీయాంశంగా మారాయి. చాటింగ్ యాప్స్, సోషల్ మీడియా వేదికగా వ్యాపిస్తోన్న ఈ ఫేక్ న్యూస్ వల్ల భారతదేశవ్యాప్తంగా 31 మంది మరణించారని బీబీసీ పరిశోధనలో తేలింది.
తమ మొబైల్స్, ఫేస్బుక్ అకౌంట్లలో ప్రత్యక్షమయ్యే ఇలాంటి ఈ ఫేక్ న్యూస్‌ను నిర్ధరించుకోకుండానే చాలామంది ఫార్వర్డ్ చేస్తుంటారు.
అలా చేయడంలో దుర్బుద్ధి లేకపోయినా, మిత్రులకు, కుటుంబ సభ్యులకు మేలు చేద్దామనే ఉద్దేశంతో చాలామటుకు ఫార్వర్డ్ చేస్తుంటారు. అలా అలా.. ఫేక్ న్యూస్ ఓ వైరస్‌లా వ్యాపిస్తోంది.
ఈ ఫేక్ న్యూస్ అన్నవి మొబైల్స్, సోషల్ మీడియాల ద్వారా కొందరు ప్రజలను హింసకు పురిగొల్పుతున్నాయి. ఈ ఫేక్ న్యూస్ వల్ల దేశవ్యాప్తంగా జరిగిన మూకదాడుల్లో ఇంతవరకూ 31 మంది మరణించారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో పిల్లలు కూడా చేరుతున్నారు. పిల్లల చేతుల్లో కూడా మొబైల్స్ రింగ్ అవుతున్నాయి.
ఇలాంటి ఫేక్ న్యూస్ గురించి మీ పిల్లలకు ఏంచెబుతారు?
వారిని ఎలా చైతన్య పరుస్తారు?
పై వీడియోను ఓసారి చూడండి..
ఇవి కూడా చదవండి
- ఫేక్ న్యూస్‌పై సమరం: ‘సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు’
- రణ్వీర్-దీపిక పెళ్లి: ఇటలీలోని 'జల్‌మహల్' ప్రత్యేకతలు ఇవే..
- ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లాలో ఎమ్మార్వో ఆఫీస్ వేలం
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటి? పాటించకపోతే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)