ఫ్రీడమ్ ట్రాష్‌క్యాన్: లిప్‌స్టిక్

  • 27 నవంబర్ 2018
లిప్‌స్టిక్ చిత్రం

విధుల్లోకి వెళ్లేటపుడు ఎక్కువ మేకప్ వేసుకునే మహిళలు.. తమ మహిళా సహోద్యుగులకన్నా ఎక్కువ వేతనం పొందుతున్నారని అమెరికాలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం సూచించింది.

అయితే.. ఏటా 800 కోట్ల డాలర్ల విలువైన వ్యాపారం జరిగే ఈ కాస్మెటిక్స్ పరిశ్రమ.. అందానికి సంబంధించి అవాస్తవికమైన అంచనాలను ప్రామాణికంగా మారుస్తోందని విమర్శకులు అంటారు.

కొన్ని ఆసియా దేశాల్లో చర్మపు రంగును తెల్లగా చేసే ఉత్పత్తుల మార్కెటింగ్ కూడా ఇందులో భాగంగా ఉంది.

చాలా ప్రాంతాల్లో ఈ సౌందర్య సాధనాల వాణిజ్య ప్రకటనలు నిరసనలకు కేంద్ర బిందువులుగా మారాయి. ఆ ప్రకటనల్లోని చిత్రాలను చాలా ఎక్కువగా మార్చివేయటం వల్ల.. నిఖార్సైన నమూనాలు అనిపించేలా ఉండే ఆ చిత్రాలతో మహిళలు తమను పోల్చుకుని ఆత్మన్యూనతకు గురయ్యే పరిస్థితి తెలుత్తుతోందని ఉద్యమకారులు అంటున్నారు.

అమెరికాలో మహిళల ఓటు హక్కు కోసం ఉద్యమించిన ‘సఫరేజెట్స్’ తొలుత లిప్‌స్టిక్ అలవాటు చేసుకున్నారు. మహిళలు అణకువగా నిరాడంబరంగా ఉండాలన్న ఆలోచనా విధానాన్ని ధిక్కరిస్తూ వారు లిప్‌స్టిక్‌ను వాడటం ఆరంభించారు.

కానీ ఇప్పుడు.. సామాజిక ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిరసన తెలపటానికి.. మహిళలు ఎటువంటి మేకప్ లేకుండా సెల్ఫీలను పోస్ట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)