ఫ్రీడమ్ ట్రాష్‌క్యాన్: హై హీల్స్

  • 27 నవంబర్ 2018
హై హీల్స్ చిత్రం

పాదాలకు హై హీల్స్ తొడగటం వల్ల కండరాలు, ఎముకల గూడు దెబ్బతింటున్నాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. హై హీల్స్ వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించటానికి.. మెత్తని ఇన్‌సోల్స్ వంటి ద్వితీయ శ్రేణి ఉత్పత్తులూ మార్కెట్‌లోకి వచ్చాయి.

అసలు ముందు ఈ హై హీల్స్ తొడగకుండానే ఉండటం మంచిది కదా?

ఇప్పుడు మహిళల సౌందర్యానికి.. కొన్ని ఉదంతాల్లో వారి బాధకు కూడా - సంబంధించినవిగా పరిగణించే ఈ హై హీల్స్.. తొలుత పురుషుల పాదరక్షలుగానే పుట్టుకొచ్చాయి.

ఒకప్పటి పర్షియాలో - నేటి ఇరాన్‌లో - అశ్వ సైనికులు గుర్రాలపై స్వారీ చేసేటపుడు కాళ్లు పెట్టుకునే కొంకీలలో పట్టుజారిపోకుండా ఉండటం కోసం వీటిని ధరించేవారు.

2016లో లండన్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న ఒక మహిళ హై హీల్స్ ధరించటానికి నిరాకరించటంతో ఆమెను ఇంటికి పంపించారు. దాంతో ఉద్యోగులు విధి నిర్వహణలో హై హీల్స్ తొడగాలని పట్టుపట్టడాన్ని చట్టవ్యతిరేకం చేయాలన్న డిమాండ్ బలంగా ముందుకొచ్చింది. కానీ ప్రభుత్వం చట్టాన్ని మార్చటానికి నిరాకరిస్తూ.. ఉద్యోగ విధుల్లో డ్రెస్ కోడ్ మీద మార్గదర్శకాలను మెరుగుపరచటానికి కృషి చేస్తామని చెప్పింది.

కొన్నేళ్ల కిందట సినీ నటి ఎమ్మా థాంప్సన్.. గోల్డెన్ గ్లోబ్స్ కార్యక్రమంలో తాను తొడుక్కున్న చాలా ఎత్తు మడమల లబోటిన్ హీల్స్‌ వల్ల చాలా నొప్పి వస్తోందంటూ వాటిని తీసివేసి పతాక శీర్షికలకెక్కారు.

ఆమె చెప్పులు లేకుండా వట్టి పాదాలతోనే ఆ కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)