ఫ్రీడమ్ ట్రాష్‌క్యాన్: సాస్‌ప్యాన్

  • 27 నవంబర్ 2018
సాస్‌ప్యాన్ చిత్రం

మనమందరం ఆహారం తినాల్సిందే. కానీ దానర్థం మనమందరమూ వంట చేస్తామని కాదు. ఆహారం వండటం, తయారు చేయటం అనేది చాలా సమయం పట్టే ఇంటి పని. ఆ పని చాలా ఎక్కువగా మహిళల మీదే పడుతుంది.

ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి రోజూ వంట చేయటంలో పురుషులకన్నా మహిళలు గంటన్నర ఎక్కువ సమయం గడుపుతున్నారు.

అయితే.. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో.. వంట చేయటానికి పురుషులు, మహిళలు గడుపుతున్న సమయంలో వ్యత్యాసం ఒక గంటగా ఉంది. మరో విశేషమేమిటంటే.. వంట గదిలో అత్యధిక సమయం గడిపే మహిళలు భారతీయ మహిళలే. 2015 సర్వే ప్రకారం భారత మహిళలు వారంలో 13 గంటలకన్నా ఎక్కువ సేపు వంట చేయటానికి వెచ్చిస్తున్నారు.

విచిత్రమేమిటంటే.. వృత్తి ప్రపంచంలో ఈ లింగ వ్యత్యాసం తలకిందులుగా ఉంది. బ్రిటన్‌లో చెఫ్ - అంటే వంట నిపుణులు - ఉద్యోగాల్లో మహిళలు కేవలం 17 శాతం మాత్రమే ఉన్నారు. దీనికి కారణం వృత్తిపరమైన వంట గదుల్లో సంస్కృతి అని కొందరు తప్పుపడితే.. ఆ ఉద్యోగాల్లో పని సమయాలు మహిళల జీవనశైలికి అనుకూలంగా లేకపోవటమని ఇంకొందరు అంటారు.

పురుష, మహిళా చెఫ్‌ల‌కు సంబంధించి మీడియా ఇచ్చే ప్రాతినిధ్యం ఈ సమస్యకు ఒక కారణమని ఒక సామాజిక అధ్యయనం సూచిస్తోంది. మేధోపరమైన, సాంకేతిక కృషి విషయంలో పురుషులకు కీర్తిప్రతిష్టలు ఇచ్చే అవకాశం అధికంగా ఉందని.. మహిళల దగ్గరకు వచ్చేసరికి వారి సాంకేతిక నైపుణ్యాల ప్రస్తావన చాలా అరుదుగా ఉంటుందని ఆ సర్వేలో గుర్తించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)