ఫ్రీడమ్ ట్రాష్‌క్యాన్: మాప్

  • 27 నవంబర్ 2018
మాప్ చిత్రం

ఇంటిని శుభ్రం చేయటంతో సహా.. ఇంటి పని అనేది మహిళల బాధ్యతగానే ఎప్పటినుంచో పరిగణిస్తూ వస్తున్నారు.

లింగాన్ని బట్టి సంప్రదాయంగా నిర్ణయించే ఇటువంటి పాత్రలను చాలా సమాజాల్లో సవాల్ చేస్తున్నప్పటికీ.. ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచటం మహిళల బాధ్యత అన్న సామాజిక ఒత్తిడి ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ఇంటి పని కూడా ఒక పూర్తి స్థాయి లేదా పార్ట్ టైమ్ ఉద్యోగంతో సమానమైనదే.

బ్రిటన్‌లో 2016లో నిర్వహించిన ఒక సర్వేలో.. వేతనం లేని ఇంటి పనులు పురుషుల కన్నా మహిళలు 60 శాతం అధికంగా చేస్తున్నారని వెల్లడైంది.

ప్రపంచ వ్యాప్తంగా చూసినపుడు.. వేతనం ఉన్న, వేతనం లేని పనుల్లో.. అభివృద్ధి చెందిన దేశాల్లో పురుషులకన్నా మహిళలు సగటున రోజుకు 30 నిమిషాలు అధికంగా పనిచేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ తేడా 50 నిమిషాలుగా ఉంది.

దీనర్థం.. రోజుకు 8 గంటలు నిద్రకు తీసేస్తే.. ఒక ఏడాదిలో పురుషుల కన్నా మహిళలకు 19 రోజులు తక్కువ అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)