ఫ్రీడమ్ ట్రాష్‌క్యాన్: బ్రా

  • 27 నవంబర్ 2018
బ్రా చిత్రం

సోషల్ మీడియాలో ప్రభావశీలురు.. ఆకారం కన్నా సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

‘‘అందంగా ఉండటానికి చాలా మార్గాలున్నాయి... మన వక్షోజాలు ఎంత నిటారుగా ఉన్నాయన్న దానితో సంబంధం లేదు’’ అని ఈ సంవత్సరపు 100 మంది మహిళల్లో ఒకరైన బ్రా-లెస్ బ్లాగర్ చిదెరా ఇగరూ అంటారు.

మహిళలు మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాల కోసం డిమాండ్ చేయటం మొదలవటంతో.. వైర్లు లేని లోదుస్తుల విక్రయాలు పెరిగాయని బ్రిటన్ రిటైలర్లు నివేదించారు.

అయితే.. బ్రాలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించటం ఇదే మొదటిసారి కాదు. 1968లో మిస్ అమెరికా అందాల పోటీ కార్యక్రమం వెలుపల జరిగిన ఒక నిరసన కార్యక్రమం తర్వాత ‘‘బ్రా బర్నింగ్ ఫెమినిస్టులు’’ (బ్రాలను తగలబెట్టే స్త్రీవాదులు) అనే మాట పుట్టుకొచ్చింది.

మహిళల అణచివేతకు చిహ్నాలుగా తాము భావించిన పలు వస్తువులను.. బ్రాలతో సహా.. కొందరు మహిళల బృందం చెత్త బుట్టలోకి విసిరింది. కానీ వాటిని వారు దగ్ధం చేయలేదు.

బ్రా అనేది వేల సంవత్సరాలుగా ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంది. అయితే 1907లో వోగ్ మేగజీన్ బ్రాసీర్ పదాన్ని కనిపెట్టింది. దుస్తుల తయారీ దారు ఇదా రోసెంథాల్ వివిధ సైజుల్లో బ్రాను డిజైన్ చేయక ముందు వరకూ.. అన్ని సైజులకూ సరిపోయే ఒకే బ్రా ఉండేది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)