ఫ్రీడమ్ ట్రాష్‌క్యాన్: మహిళల మేగజీన్లు

  • 28 నవంబర్ 2018
మేగజీన్ల చిత్రం

మొట్టమొదటి మహిళల మేగజీన్.. 1693లో బ్రిటన్‌లో ప్రచురితమైన ‘ద లేడీస్ మెర్క్యురీ’ అని భావిస్తారు.

‘‘కన్యలైనా, భార్యలైనా, వితంతువులైనా.. స్త్రీలకి చెందిన ప్రేమ, పెళ్లి, ప్రవర్తన, దుస్తులు, హాస్యాలకు సంబంధించిన చాలా మంచి, ఆసక్తికరమైన ప్రశ్నలన్నిటినీ’’ కవర్ చేస్తామని ఆ మేగజీన్ పేర్కొంది.

నేటి మహిళల మేగజీన్లు.. ఫ్యాషన్, సెలబ్రిటీ గాసిప్‌లు కవర్ చేస్తామని చెప్తాయేమో. కొన్ని మేగజీన్లు చాలా ఇతర అంశాలను కూడా కవర్ చేస్తాయనేది వేరే విషయం.

పాఠకులు కోరుకుంటున్న దానినే తాము ఇస్తున్నామనే దానికి తమ మేగజీన్ల విజయమే రుజువని వాటి యజమానులు, ఎడిటర్లు వాదించవచ్చు.

జాబితా నుంచి ఒక వస్తువును ఎంపిక చేసుకుని, దానిని పీడనకు సంబంధించిన వస్తువుగా ఎలా పరిగణించవచ్చో కనుగొనండి.

అయితే.. సెలబ్రిటీ - అంటే పేరు ప్రఖ్యాతుల విషయంలో ఆధునిక భావావేశం.. ముఖ్యంగా యుక్తవయస్కుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందన్న విమర్శలు ఉన్నాయి.

బ్రిటన్‌లో 11-16 ఏళ్ల మధ్య వయసున్న వారి మీద నిర్వహించిన ఒక సర్వేలో.. పర్‌ఫెక్ట్‌గా కనిపించటానికి వారు ఎదుర్కొంటున్న ఒత్తిడికి కారణం ఈ సెలబ్రిటీ సంస్కృతేనని 58 శాతం మంది తప్పుపట్టారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)