ఫ్రీడమ్ ట్రాష్‌క్యాన్: పెళ్లి ఉంగరాలు

  • 27 నవంబర్ 2018
పెళ్లి ఉంగరం చిత్రం

ప్రేమ, ప్రణయాల పర్యవసానంగా.. చాలా ఉదంతాల్లో డబ్బుల వసూళ్ల పండుగలుగా ఆధునిక రూపం తీసుకోవటానికి ముందు.. పెళ్లి అనే దానిని సంప్రదాయంగా గిరిజన, రాజకీయ సంబంధాలను ఏర్పరచుకోవటానికి ఉపయోగించుకునేవారు.

ప్రస్తుతం బ్రిటన్‌లో ఒక వివాహానికి సగటున 39,000 డాలర్లు (సుమారు రూ. 35 లక్షలు) వ్యయం అవుతుందని ఇటీవల ఒక సర్వేలో వెల్లడైంది.

శాశ్వతత్వానికి చిహ్నంగా వృత్తాన్ని పరిగణించే ప్రాచీన ఈజిప్టు సంప్రదాయం నుంచి పెళ్లి ఉంగరం రూపొందింది. కానీ ఇప్పుడు బ్రిటన్‌లో పెళ్లికి సిద్ధపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది.

2015లో బ్రిటన్‌లో వివాహాల రేటు రికార్డు స్థాయికి తగ్గిపోయింది. మరోవైపు విడాకుల రేటు అధికంగా ఉందని చెప్తున్నారు. వివాహ బంధానికి వెలుపల జీవించటానికి సంసిద్ధత పెరుగుతుండటం.. పెళ్లి పండుగల ఖర్చులు ఉన్నదంతా ఊడ్చేసేలా ఉండటం.. వివాహాల రేటు పడిపోవటానికి కారణమని పరిశీలకుల విశ్లేషణ.

అమెరికాలో విడాకుల రేటు నిజానికి తగ్గిపోతోంది. అయితే.. దీనికి ప్రధాన కారణం చాలా జంటలు పెళ్లి చేసుకోవటానికి ఇంకా వయసు పెరిగే వరకూ వేచి ఉండాలని భావించటమేనని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)