ఫ్రీడమ్ ట్రాష్‌క్యాన్: సోషల్ మీడియా

  • 27 నవంబర్ 2018
సోషల్ మీడియా చిత్రం

ప్రపంచంలో దాదాపు సగం మంది ఇప్పుడు సోషల్ మీడియా వాడుతున్నారు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్ట్రాగ్రామ్ మొదలుకుని.. ఆసియాలో వీబో, వియ్‌చాట్, కకావోస్టోరీ వరకూ ఇందులో ఉన్నాయి.

పశ్చిమ, ఉత్తర యూరప్‌లో.. ప్రతి 10 మందిలో తొమ్మిది కన్నా ఎక్కువ మంది వీటిలో కనీసం ఒక నెట్‌వర్క్ ఉపయోగిస్తున్నారు.

కానీ.. ఆన్‌లైన్‌లో స్నేహితులు, సెలబ్రిటీలను ఫాలో అవటం.. వారి జీవితాలతో మన జీవితాలను పోల్చిచూసుకోవటం.. మన జీవితాలను దయనీయంగా మార్చుతుండవచ్చు.

సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించేవారు.. తమకు ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలు ఉన్నాయని చెప్పే అవకాశం అధికంగా ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ముఖ్యంగా యువతులు.. తాము ఎలా కనిపిస్తున్నామనే దానిని సోషల్ మీడియా మరింత ఎక్కువగా పట్టించుకునేలా చేస్తోందని చెప్తున్నారు.

తాము ఆన్‌లైన్‌లో ఉన్నపుడు.. తాము ఎలా కనిపిస్తున్నామనేదే ఇతరులు చాలా ముఖ్యంగా పట్టించుకునే విషయమని గర్ల్‌గైడింగ్ అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో.. పదేళ్ల వయసున్న బాలికలు ప్రతి పది మందిలో ఏడుగురు చెప్పారు. అందులో దాదాపు పావు శాతం మంది తాము ఇంకా పెర్‌ఫెక్ట్‌గా కనిపించాల్సిన అవసరముందని భావిస్తున్నారని కూడా ఆ సర్వేలో గుర్తించారు.

లైంగిక దాడులు, వేధింపుల గురించి చాలా మంది మహిళలు మాట్లాడటానికి వీలు కల్పించిన #MeToo ఉద్యమం.. సోషల్ మీడియాలోనే ప్రారంభమై.. మహిళలు తమ కథలను ఆన్‌లైన్‌లో పంచుకోవటంతో అంతర్జాతీయ స్థాయి చర్చనీయాంశంగా మారిన నిరసన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)