గాజా: మళ్లీ ప్రాణం పోసుకున్న గ్రాండ్ పియానో

  • 21 నవంబర్ 2018
గాజా గ్రాండ్ పియానో

గాజా స్ట్రిప్‌లో ఏకైక కన్సర్ట్ గ్రాండ్ పియానో.. 2014లో ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని తట్టుకుని నిలబడింది.

ఇంతకుముందు ఈ పియానో ఉన్న భవనం బాంబుల దాడిలో ధ్వంసమైపోయింది.

ఈ పియానోను ఒక స్వచ్ఛంద సంస్థ ఎంతో శ్రమించి పునరుద్ధరించింది.

గాజాలో మ్యూజిక్ స్కూళ్లు చాలా తక్కువ. అటువంటి ఒక సంగీత పాఠశాలకు దీనిని చేర్చింది.

ఇటీవలే మొదటిసారి సంగీత కచేరీలో ఈ పియానోను ప్లే చేశారు.

‘‘ఇది ఎంత విచారంగా ఉందో అయినా ఎంత సంతోషంగా ఉందో మనకు అర్థమవుతుంది. పియానోను ప్లే చేస్తున్న ప్రతిసారీ అప్పుడు, ఇప్పుడు ఇది ఎలా ఉందన్నది నా మదిలో కదలాడుతూ ఉంటుంది’’ అని సారా అకెల్ అనే మ్యూజిక్ స్టూడెంట్ చెప్పారు.

గాజా స్ట్రిప్‌లో ప్రత్యక్ష సంగీత కచేరీ చాలా అరుదు.

దాదాపు 19 లక్షల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దిగ్బంధంలో జీవిస్తున్నారు.

మూడు యుద్ధాల వేదనను తట్టుకోవడంలో సంగీతం సాయపడిందని సారా పేర్కొన్నారు.

‘‘ఎవరైనా సాంత్వన పొందటానికి ఏదైనా కావాలనుకున్నపుడు సంగీతం సాయం చేస్తుంది’’ అని ఆమె చెప్తారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)