జర్మనీ: రోడ్డుపై టన్ను చాక్లెట్ లీక్.. 108 చదరపు అడుగులు చాక్లెట్ మయమైన రోడ్డు

  • 12 డిసెంబర్ 2018
వాతావరణం బాగా చల్లగా ఉండటంతో రోడ్డుపై పడిన చాక్లెట్ వెంటనే గట్టిపడిపోయింది Image copyright Reuters
చిత్రం శీర్షిక వాతావరణం బాగా చల్లగా ఉండటంతో రోడ్డుపై పడిన చాక్లెట్ వెంటనే గట్టిపడిపోయింది

జర్మనీలో ఒక టన్ను చాక్లెట్ స్థానికంగా ఒక రోడ్డుపై రాకపోకల్ని నిలిపివేసిందని అధికారులు చెప్పారు.

ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి ట్యాంకులో రవాణా అవుతున్న చాక్లెట్ పశ్చిమ జర్మనీలోని వెస్టొనెన్ పట్టణంలోని ఒక రోడ్డుపై సోమవారం సాయంత్రం లీకయ్యింది. రోడ్డుపై తారుతో లేయర్ వేసినట్లుగా చాక్లెట్ పరచుకుంది. వెంటనే అది గట్టిపడిపోయింది.

దాదాపు 10 చదరపు మీటర్లు (108 చదరపు అడుగులు) మేర పరచుకున్న చాక్లెట్‌ను తొలగించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానిక సిబ్బంది కలసి గడ్డపారలు, వేడి నీళ్లు, వేడిగాలిని వెదజల్లే బ్లోయర్లను ఉపయోగించారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక గడ్డపారలు పట్టుకుని చాక్లెట్ తొలగిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ఈ తియ్యని ఎమర్జెన్సీ కార్యక్రమంలో చాక్లెట్ ఫ్యాక్టరీ డ్రీమిస్టెర్ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.

‘‘ఇది గుండెలు పిండేసే సంఘటన. అయినప్పటికీ ఈ క్రిస్‌మస్‌కు చాక్లెట్ల కొరత ఉండకపోవచ్చు’’ అని అగ్నిమాపక శాఖ సిబ్బంది అన్నారు.

బుధవారం నాటికల్లా తమ ఫ్యాక్టరీలో చాక్లెట్ తయారీ కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని డ్రీమిస్టెర్ స్థానిక మీడియాకు చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ

చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు - అభిజిత్ బెనర్జీ

#100Women: మహిళలు చదువుకుంటే ప్రపంచానికే మేలు - అరణ్య జోహర్

భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్

ప్యాంటు విప్పి, కాలిపర్స్ తీసి స్కానర్‌లో పెట్టాలి.. వికలాంగ ఉద్యమకారులకు విమానాశ్రయంలో అవమానం

కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?

హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు

ఆస్ట్రేలియాలోని వార్తాపత్రికలు మొదటి పేజీలను పూర్తిగా నలుపు రంగుతో నింపేశాయెందుకు?