ఒకప్పుడు భారత్‌ కంటే నిరుపేద దేశమైన చైనా గత 40 ఏళ్లలో ఎలా ఎదిగింది? తెలుసుకోండి 9 పటాల్లో

  • 19 డిసెంబర్ 2018
చైనా Image copyright Getty Images

ఒకప్పుడు భారత్ కంటే ఆర్థికంగా వెనకబడిన దేశం చైనా. కానీ, గత 40 ఏళ్లలో అక్కడ 74 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు.

భారత్‌లాంటి ఎన్నో దేశాలను వెనక్కునెట్టి ఆసియాలోనే అగ్రగామిగా చైనా దూసుకెళ్తోంది. 1978లో కేవలం 150 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి, ఇప్పుడు ఏకంగా 12,237 బిలియన్ డాలర్లకు చేరింది.

నలభై ఏళ్ల క్రితం ఆ దేశం చేప్పటిన ఆర్థిక సంస్కరణల విధానం చైనాను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పట్నుంచీ ఆ సంస్కరణలను చాలా జాగ్రత్తగా అమలు చేస్తూ వస్తున్నారు.

1978 డిసెంబరులో మావోయిజాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్న చైనా దేశాన్ని ఓ కొత్త మార్గంలో ముందుకు తీసుకెళ్లింది. నాలుగు దశాబ్దాల తరువాత ఎవరికీ సాధ్యంకాని మార్పును ఆ దేశం సాధించింది. ఆర్థికంగా ఈ నలభై ఏళ్లలో చైనా సాధించిన పురోగతికి కూడా మరే దేశమూ సాటి రాదు.

ఆ ప్రగతిని సులువుగా అర్థం చేసుకోవడానికి వీలుగా 1978-2018 మధ్య చైనా సాధించిన అనూహ్య మార్పులను ఈ తొమ్మిది పటాల్లో అందిస్తున్నాం.

1. 1978-2018 మధ్య చైనా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 150 బిలియన్ డాలర్ల నుంచి 12,237 బిలియన్ డాలర్లకు పెరిగింది.

2. చైనాలో ద్విచక్ర వాహనాల వినియోగం తగ్గిపోయింది. వాటి స్థానంలో కార్లు దూసుకొచ్చాయి.

3. వాహనాలతో పాటు చైనా ఉత్పత్తి చేసే కర్బన ఉద్గారాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అది పర్యావరణానికి చాలా హాని కలిగిస్తోంది.

4. నాలుగు దశాబ్దాల్లో చైనా, ప్రపంచంలోనే అత్యధిక విద్యుత్తును వినియోగించే దేశాల్లో ఒకటిగా మారిపోయింది.

5. 1978 నుంచి 2018 మధ్య చైనా ప్రభుత్వం 74 కోట్ల మందికి పైగా ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు తీసుకొచ్చింది. చైనా జాతీయ గణాంకాల బ్యూరో, కౌన్సిల్ సమాచార కార్యాలయాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

6. ఏటా విదేశాల్లో చదువుకునే చైనా విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. చదువు కోసం ఎక్కువమంది విద్యార్థులను విదేశాలకు పంపే దేశాల్లో చైనా ముందు వరుసలో ఉంది.

7. వయసుల వారీగా కూడా చైనా జనాభాలో ఈ నలభై ఏళ్లలో చాలా మార్పులొచ్చాయి. 1978తో పోలిస్తే అక్కడ వయసు మీదపడిన వారి సంఖ్య బాగా పెరిగింది.

8. వృద్ధుల సంఖ్య పెరగడానికి కారణం అక్కడ మహిళల గర్భదారణ శక్తి తగ్గడమే.

9. చైనాలో ప్రజల కొనుగోలు శక్తి బాగా పెరిగింది. అక్కడ తమ సొంతింటి కలను నిజం చేసుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. అమెరికాలోని యువతతో పోలిస్తే చైనా యువత సొంతింటిని కొనుక్కునే అవకాశం రెండు రెట్లు ఎక్కువ.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)