ప్రతి మూడు పాత విస్కీలలో ఒకటి నకిలీదే

విస్కీ

కొందరు బంగారంలో పెట్టుబడి పెడుతారు. మరికొందరు అరుదైన చిత్రాల సేకరణను పెట్టుబడిగా చూస్తారు. ఇంకొందరు పాత స్కాచ్ విస్కీలను కూడా పెట్టుబడిగానే భావిస్తారు. కానీ, అరుదైన మద్యం సరఫరా తగ్గిపోతున్న క్రమంలో పాత విస్కీలని చెబుతున్నవాటిలో నకిలీవే ఎక్కువనే ఆందోళన పెరుగుతోంది.

విస్కీ ఎంత పాతదైతే దాని రేటు అంత ఎక్కువ పలుకుతుంది. కానీ, ప్రతి మూడు పాత విస్కీలలో ఒకటి నకిలీదేనని తేలింది.

రేర్ విస్కీ 101కు చెందిన అండీ సింప్సన్ బృందం.. 55 పాత మాల్ట్ స్కాచ్ విస్కీలను పరీక్షించింది. ఇందులో 21 విస్కీలు నకిలీవని తేలింది.

వీడియో క్యాప్షన్,

ప్రతి మూడు పాత విస్కీలలో ఒకటి నకిలీదే

వేలం పాటలు, వ్యక్తిగత సేకరణలు, చిరు వ్యాపారుల నుంచి ఈ విస్కీలను వారు తీసుకొని పరీక్షించారు. కార్బన్ డేటింగ్ లాంటి అధునాతన పద్ధతులతో పరీక్షలు జరిపారు.

పరీక్షలో నకిలీవని తేలిన 21 విస్కీ సీసాల ఖరీదు.. ఐదున్నరకోట్ల రూపాయల పైమాటే ఉంది. నిపుణుల అంచనా ప్రకారం సేకరించిన, సెకండరీ మార్కెట్లో లభించే పాత

విస్కీలలోదాదాపు రూ.350 కోట్ల విస్కీ నకిలీదే.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)