లండన్‌లో సంస్కృత పాఠాలు, శ్లోకాలు..

లండన్‌లో సంస్కృత పాఠాలు, శ్లోకాలు..

సంస్కృతంకు దేవభాషగా పేరుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఇప్పటి భారతదేశంలోని చాలా ప్రాంతాలను ఏలిన ఈ రాచభాషకు ప్రస్తుతం ఆదరణ కరవయ్యింది. భారత్‌లో.. కేవలం మార్కుల కోసమే విద్యార్థులు సంస్కృతాన్ని తమ రెండో భాషగా తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కానీ కొన్ని దేశాల్లో ఈ భాషకు మంచి ఆదరణ కనిపిస్తోంది. ఉదాహరణకు బ్రిటన్‌ను తీసుకుంటే, అక్కడ కొందరు తల్లిదండ్రులు సంస్కృతాన్ని తమ పిల్లలకు నేర్పిస్తున్నారు. వీరిలో భారతీయ మూలాలున్నవారితోపాటు విదేశీయులు కూడా సంస్కృతాన్ని తమ పిల్లలకు నేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ వివరాలను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)