బ్రిటన్లోని భారతీయులు దైవభాష సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నారు?

సంస్కృతంకు దైవభాషగా పేరుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఇప్పటి భారతదేశంలోని చాలా ప్రాంతాలను ఏలిన ఈ రాచభాషకు ప్రస్తుతం ఆదరణ కరవయ్యింది. భారత్లో.. కేవలం మార్కుల కోసమే విద్యార్థులు సంస్కృతాన్ని తమ రెండో భాషగా తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ కొన్ని దేశాల్లో ఈ భాషకు మంచి ఆదరణ కనిపిస్తోంది. ఉదాహరణకు బ్రిటన్ను తీసుకుంటే, అక్కడ కొందరు తల్లిదండ్రులు సంస్కృతాన్ని తమ పిల్లలకు నేర్పిస్తున్నారు. వీరిలో భారతీయ మూలాలున్నవారితోపాటు విదేశీయులు కూడా సంస్కృతాన్ని తమ పిల్లలకు నేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఈ ప్రాచీన భాషకు గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు, బ్రిటన్ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు ప్రముఖ సంస్కృత పండితుడు స్వామి రామకృష్ణానంద.
‘‘భారత దేశం జ్ఞానానికి పుట్టినిల్లు. మనకున్నదంతా సంప్రదాయకమైన జ్ఞానమే. అన్ని రకాల శాస్త్రాలు, గ్రంథాలు సంస్కృతంలోనే ఉన్నాయి’’ అన్నారు స్వామి రామకృష్ణానంద.
బ్రిటన్లోని చాలా మంది తల్లిదండ్రులు కూడా తొలిసారి ఈ భాషను నేర్చుకుంటున్నారు.
లండన్లో సంస్కృత పాఠాలు
‘‘నా పేరు జెస్సికా. నా కొడుకు పేరు ధ్యాన్. సంస్కృతం చాలా బాగుంది. ఆ పదాలను వింటూ మళ్లీ వాటిని వల్లెవేయడం పిల్లలకు కూడా బాగున్నట్లుంది. పదాలు, పాటలు వినడాన్ని పిల్లలు కూడా ఇష్టపడుతున్నారనుకుంటా’’ అని స్వామి రామకృష్ణానంద సంస్కృత తరగతులకు హాజరైన జెస్సికా చెప్పారు.
హిందూ మతంలోని పవిత్ర గ్రంథాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి.
అయితే నేడు ఒక్క శాతం భారతీయులు మాత్రమే ఈ భాషను మాట్లాడుతున్నారు.
సంస్కృతం నేర్చుకోవడంపై అపోహ
‘‘ప్రజలు సంస్కృతం నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా కష్టమైన భాషని వారు భావిస్తుంటారు. అందువల్ల ఈ అపోహను తొలగించి, సులభంగా నేర్చుకునేలా, ఆసక్తి పెరిగేలా తీర్చిదిద్దుతున్నాం. ఆటలు, పాటలు ద్వారా సులభంగా నేర్పొచ్చనే ఉద్దేశంతో ఈ మార్గం ఎంచుకున్నాం’’ అని స్వామి రామకృష్ణానంద తెలిపారు.
‘‘మా భారతీయ సాంస్కృతిక సంపదను పొందే మార్గమే సంస్కృతం. మా సంప్రదాయాలు, సాహిత్యం, ఆయుర్వేదం, విజ్ఞానం వంటి సకల సమాచారం సంస్కృత గ్రంథాల్లోనే ఉంది. ఆ వారసత్వాన్ని మేం పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు’’ అని జెస్సికా అన్నారు.
సంస్కృతాన్ని ప్రొత్సహించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సిద్ధంగా ఉన్నారు.
బ్రిటన్లోని కొత్త తరం సంస్కృతాన్ని నేర్చుకునేందుకు తన పాఠాలు తోడ్పడతాయని స్వామి రామకృష్ణానంద భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- తెలుగులో వాడుక భాషకు పట్టం గట్టిందెవరు?
- ఆ దేశంలో తెలుగుకున్న క్రేజ్ అంతా, ఇంతా కాదు!
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- జీరోగా మారినా.. జీవితం అంతమైపోదు: షారుఖ్ ఖాన్
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- త్రిపుర ఘటన గుర్తొస్తే ఇప్పటికీ నాకు నిద్ర పట్టదు.. అత్యాచార బాధితులను కలిసిన మహిళా రిపోర్టర్ అనుభవాలు
- పౌడర్ రాసుకుంటే క్యాన్సర్ వస్తుందా?
- త్రిపుర ఘటన గుర్తొస్తే ఇప్పటికీ నాకు నిద్ర పట్టదు.. అత్యాచార బాధితులను కలిసిన మహిళా రిపోర్టర్ అనుభవాలు
- #UnseenLives: మీరు తెలుసుకోవాల్సిన ‘రెండు గ్లాసుల’ పద్ధతి.. ఇది తెలుగు రాష్ట్రాల్లోని చరిత్ర
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)