నెలసరి సమయంలో హార్మోన్ల ప్రభావం, జననేంద్రియాల ఆరోగ్యం గురించి మహిళలు తెలుసుకోవాల్సిన 5 విషయాలు

  • డాక్టర్ అనితా మిత్రా
  • బీబీసీ ఫిట్ అండ్ ఫియర్‌లెస్ కోసం

ఆరోగ్యమే మహాభాగ్యం అని అని అందరికీ తెలుసు. కానీ మనం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన కొన్ని విషయాల్లో మాత్రం అంత ఆరోగ్య సూత్రాలు పాటించం.

అందుకే, మన శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్ అనితా మిత్రా చెబుతున్నారు.

ఆమె తన బృందంతో కలిసి మహిళలు ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన 5 కీలక విషయాలను వెల్లడించారు

1, జీవనశైలి వల్ల పిరియడ్స్‌పై ప్రభావం

ఒత్తిడి, అతి వ్యాయామం లాంటివి మీ పిరియడ్స్‌పై ప్రభావం చూపించవచ్చు. వాటివల్ల రక్తస్రావం తీవ్రంగా కావడం, లేదా కొద్దిగా కావడం, లేదా మొత్తానికి అసలు రాకుండా ఉండడమే జరగవచ్చు.

"మనం చాలా కఠిన శిక్షణ తీసుకున్నప్పుడు మన శరీరం కూడా చాలా ఒత్తిడికి గురవుతుంది. దానివల్ల మీకు పిరియడ్స్ రాకపోవచ్చు. దానికి ఒక కారణం ఏంటంటే.. మీరు తగినంత ఈస్ట్రోజన్ ఉత్పత్తి చేయలేకపోవడమే. ఈస్ట్రోజన్ స్త్రీ జననేంద్రియాల ఆరోగ్యం కోసమే కాదు, అది మన ఎముకలను కూడా చాలా బలంగా ఉంచుతుంది" అంటారు డాక్టర్ మిత్రా.

అందుకే మనకు నెలసరి సరిగా రానప్పుడు, మనం మన ఎముకలకు అవసరమైన పోషకాలు అందించడం కుదరదు. అలా మనమే మన ఎముకలను బలహీనంగా మార్చేస్తాం.

వారం పాటు ఏదైనా కఠిన శిక్షణ తీసుకోవడానికి బదులు వారంలో కొన్నిసార్లు చాలా తక్కువ తీవ్రత ఉన్న వర్కవుట్స్ చేయాలని డాక్టర్ మిత్రా బృందం సూచిస్తోంది.

మీరు ఆరోగ్యంగా ఉండడానికి తగినంత ఆహారం తీసుకుంటున్నారా? కంటి నిండా నిద్రపోతున్నారా? అనేది కూడా తెలుసుకోవాలని వారు చెబుతున్నారు.

2. నెలసరి తేదీలు మారుతుండడం

రుతు చక్రం 'సాధారణం'గా 28 రోజులకు వస్తుంటుందని అందరూ భావిస్తారు. కానీ ఇది నిజానికి సగటు మహిళకు మాత్రమే జరుగుతుంది.

బహుశా 10 మందిలో ఒకరికి మాత్రమే ఇలా 28 రోజుల రుతుచక్రం ఉంటుంది.

"సాధారణ రుతు చక్రం ఎలా అయినా ఉండచ్చు. అంటే మీరు నెలసరి తేదీని ఊహించుకోవచ్చు. అది దాదాపు పదిరోజుల్లోనే అవుతుందా? లేక మరో వారం పడుతుందా? అని. అలా నెలసరి ఎప్పుడు వస్తుంది అనేదానిపై మీరు ఒక కచ్చితమైన అంచనాకు రావచ్చు" అని డాక్టర్ మిత్రా చెప్పారు.

3. పీఎంఎస్‌కు మీ ప్రొజెస్టరాన్ స్థాయిలే కారణం

రుతు చక్రంలో వివిధ సమయాల్లో హార్మోన్ల స్థాయి పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది.

సరిగ్గా మీ పిరియడ్ వచ్చే ముందు ప్రొజెస్టరాన్ ఎక్కువ అవుతుంది. అది మీలో చాలా లక్షణాలకు కారణమవుతుంది.

అంటే మీ వక్షోజాలు పెద్దవి కావడం, నొప్పిగా ఉండడం, తలనొప్పి, వికారంగా ఉండడం వంటి లక్షణాలు.

ప్రొజెస్టరాన్ అనేది ప్రొ-జెస్టేషన్ హార్మోన్ అంటే గర్భదారణకు అనుకూలంగా ఉండే హార్మోన్.

అంటే సాధారణంగా ఈ హార్మోన్ వల్లే మీరు గర్భం ధరిస్తారు. అందుకే మీ నెలసరి సమయంలో మీకు చాలా ప్రొజెస్టరాన్ అందుతుంది.

అలా మీలో చాలా నీరు నిల్వ ఉంటుంది. అది మీ వక్షోజాలు పెద్దగా అయ్యేలా చేస్తుంది.

కొంతమందికి ఐబీఎస్(ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్) లక్షణాల్లా ఇవి చాలా ఉబ్బిపోతాయి. అంటే అదంతా మీ రుతు చక్రం సమయంలో రకరకాల హార్మోన్ల వల్లే జరుగుతుంది.

4.పూర్తి నార్మల్‌గా డిశ్చార్జ్

డిశ్చార్జ్ పూర్తిగా సాధారణంగా ఉంటుందని డాక్టర్ మిత్రా చెప్పారు.

కానీ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన శరీరం ఏం చేస్తుంది అనేదాని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే పరిస్థితులు సరిగా అనిపించనపుడు మనం తెలుసుకోగలిగేలా ఉంటాలి అన్నారు.

"వజైనల్ డిశ్చార్జ్ గురించి చాలా మంది తీవ్రంగా ఆందోళనకు గురికావడం నేను చూశాను. మహిళల డిశ్చార్జ్ నెల అంతటా మారుతూనే ఉంటుంది. మన హార్మోన్లు ఏం చేస్తున్నాయనేదాన్ని బట్టి అది అలా మారుతూ ఉంటుంది" అని తెలిపారు.

మొత్తం నెల అంతా మీ డిశ్చార్జ్ మారుతూ ఉంటే, అది ఆ సమయంలో మీలో హార్మోన్ల స్థాయిపైన ఆధారపడి ఉంటుంది. కానీ డిశ్చార్జ్‌లో గణనీయ మార్పులు కనిపిస్తే మీరు డాక్టర్ సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.

"అక్కడ ఎలాంటి పొరపాటు జరిగిందో మీరు తెలుసుకునే ముందు, మీకు నార్మల్ డిశ్చార్జ్ ఎలా అవుతుంది అనే విషయం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది".

5.మహిళలకు మరింత కొవ్వు అవసరం

పురుషుల కంటే మహిళల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఎందుకు ఉంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది 'సర్వ సాధారణం' అంటారు డాక్టర్ మిత్రా.

మహిళల హార్మోన్లు కొవ్వుతో తయారవుతాయి. కొలెస్ట్రాల్‌తో తయారవుతాయి. మన హార్మోన్లు వాటి నుంచే వస్తాయి.

జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉండడానికి, ముఖ్యమైన అవయవాల రక్షణకు మహిళలకు శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉండడం చాలా అవసరం.

కొవ్వు కణజాలంలో ఈస్ట్రోజన్ తయారవుతుంది. అందుకే తక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల రుతుచక్రంపై ఆ ప్రభావం కనిపిస్తుంది.

సింపుల్‌గా చెప్పాలంటే, "మీరు మీ శరీరానికి కావల్సిన దినుసులను అందించకపోతే, అవి వస్తువులను తయారు చేసుకోలేవు. అంతే" అంటారు డాక్టర్ మిత్రా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)