పోర్నోగ్రఫీ సమస్యకు దక్షిణ కొరియా పోలీసుల షాక్ థెరపీ

దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫీ సమస్య
ఫొటో క్యాప్షన్,

''ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి మీరూ ఒక కారణం కావొచ్చు''

దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫీ పెద్ద సమస్యగా మారింది. రహస్యంగా అమర్చిన కెమేరాల కారణంగా ఏటా వేలాదిగా లైంగిక నేరాలు జరుగుతున్నాయి.

రహస్యంగా చిత్రీకరించిన ఇలాంటి దృశ్యాల కోసం ఆన్‌లైన్‌లో వెతికేవారు ఎక్కువవుతున్నారు. అలాంటివారికి ఇప్పుడు పోలీసులు ఊహించని షాక్ ఇస్తున్నారు.

''ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి మీరూ ఒక కారణం కావొచ్చు'' అన్న హెచ్చరికలు కనిపిస్తున్నాయి.

అంతేకాదు, పోలీసులు అంతా చూస్తున్నారని కూడా కొన్ని వీడియోల్లో రాసి ఉంటోంది.

గమనిక: ఈ క్రింది వీడియోలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని భయపెట్టవచ్చు

వీడియో క్యాప్షన్,

వీడియో: పోర్నోగ్రఫీ సమస్యకు పోలీసులు ఇస్తున్న షాక్ థెరపీ ఇదే...

ఇవన్నీ పోర్న్ వీక్షకులను తగ్గించేందుకు దక్షిణ కొరియా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు.

వీటిని ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారు. పోర్న్ వీడియోలుగా భావించి వేలాది మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.

ఈ షాక్ థెరపీతో పోర్న్ దృశ్యాలు చూసేవారిని నియంత్రించొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దక్షిణ కొరియాలో రహస్య కెమేరాలతో వీడియోలు చిత్రీకరించేవారు దొరికితే అయిదేళ్ల జైలు శిక్ష ఖాయం.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)