స్పై కెమెరా పోర్న్‌: దక్షిణ కొరియా మహిళలకు అడుగడుగునా రహస్య కెమెరా

  • 29 డిసెంబర్ 2018
దక్షిణ కొరియా యువతి

దక్షిణ కొరియాలో రహస్య కెమెరాలతో తీసిన అశ్లీల వీడియోల సమస్య విపరీతంగా పెరిగిపోయింది.

హోటళ్లు, హాస్టళ్లలోని దుస్తులు మార్చుకునే గదుల్లో, ప్రభుత్వం ఏర్పాటు చేసే టాయిలెట్లలో దుండగులు రహస్య కెమెరాలు అమర్చుతున్నారు. వాటితో చిత్రీకరించిన వీడియోలను పోర్న్ వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తున్నారు.

బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. సూ- యెన్ పార్క్ అనే ఈ యువతి కూడా ఓ బాధితురాలే.

ఇప్పుడు తనలాంటి బాధితుల తరఫున పోరుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు? వారికి న్యాయం జరిగేలా చూసేందుకు సాయపడుతున్నారు సూ- యెన్.

ప్రస్తుతం దక్షిణ కొరియాలో స్పై కెమెరా పోర్న్ సమస్య ఎంత అరాచకంగా మారిందో ఆమె వివరించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: అరాచకంగా మారుతున్న 'స్పై కెమెరా పోర్న్‌'

ఆమె ఓ వెబ్‌సైట్‌ను చూపించారు. అందులో 'స్పై క్యామ్ వీడియో' చాలా ఉన్నాయి.

స్పై కెమెరాలను అమ్మే వెబ్‌సైట్‌ను కూడా ఆమె తెరిచి చూపించారు. అందులో పలు రకాల మినీ కెమెరాలు ఉన్నాయి. ఒక కెమెరా నీళ్ల బాటిల్‌లో అమర్చి ఉంది. ఆ బాటిల్‌తో నీళ్లు తాగుతున్నప్పుడు కూడా దానికున్న కెమెరాను అంత సులువుగా గుర్తించే అవకాశం లేదని ఆమె చెప్పారు.

ఇలాంటి చిల్లర చేష్టల వల్ల పబ్లిక్ టాయిలెట్లకు వెళ్లాలంటేనే చాలామంది మహిళలు భయపడుతున్నారని సూ- యెన్ పార్క్ అంటున్నారు.

Image copyright Jean Chung
చిత్రం శీర్షిక స్పై కెమెరాల నిరోధానికి చర్యలు తీసుకోవాలంటూ దక్షిణ కొరియాలో ఆందోళనలు

అలాంటి వీడియోలు తీసేవారిని కఠినంగా శిక్షించాలని, ఈ అకృత్యాలను ప్రభుత్వం కట్టడి చేయాలంటూ దక్షిణ కొరియాలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.

బాధితుల తరఫున తన పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.

ఏటా బీబీసీ విడుదల చేసే ప్రపంచంలోని '100 మంది ప్రభావశీల మహిళల జాబితా'లో సూ- యెన్ పార్క్ పేరు కూడా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)