బీబీసీ తెలుగులో ఈ వార్తలను ఈ ఏడాది లక్షల మంది చదివారు.. మరి మీరు

ఊహా చిత్రం

హాయ్.. 2018 చూస్తుండగానే గడిచిపోయింది.

ఈ సంవత్సరం బీబీసీ తెలుగు కొన్ని వందల కథనాలను, వార్తలను, విశేషాలను వీడియో, టెక్స్ట్, గ్రాఫిక్స్ రూపంలో పబ్లిష్ చేసింది.

వీటిలో అత్యధిక పాఠకాదరణ పొందిన టాప్ 5 వార్తలను ఎంపిక చేసి ఇస్తున్నాం.

1.వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసినారు..' - విముక్తి పొందిన మహిళల కన్నీటి గాథలు

ఇది బీబీసీ తెలుగు Exclusive story. రాయలసీమలోని అనంతపురం, కడప జిల్లాల నుంచి కొన్ని దశాబ్దాలుగా మహిళల అక్రమ రవాణా సాగుతోంది. ఇక్కడి పేద మహిళలను దిల్లీ, ముంబయి, పూణె నగరాల్లోని వ్యభిచార గృహాలకు అక్రమంగా తరలిస్తున్నారు. కొందరు మహిళలు కరువు కారణంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యభిచార కూపంలోకి వెళుతుంటే.. మరికొందరు బ్రోకర్ల చేతిలో మోసపోయి ఆ ఊబిలో చిక్కుకుంటున్నారు.

అక్రమ రవాణాకు పాల్పడుతున్న బ్రోకర్లు.. తమ సామ్రాజ్యాన్ని భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విస్తరించుకుంటున్నారని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తుంటే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పోలీసులు చెబుతున్నారు.బ్రోకర్ల చేతిలో మోసపోయి, వ్యభిచార కూపాల్లో మగ్గి, అక్కడి నుంచి బయటపడ్డ ముగ్గురు మహిళలతో బీబీసీ మాట్లాడింది. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురి వ్యధాభరిత గాథలు వారి మాటల్లోనే..

ఫొటో సోర్స్, Rajshri Deshpande

2.'అది భార్యాభర్తల పడక సీన్‌. అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు'

ఒక మహిళ తన జాకెట్ బటన్లు విప్పగానే ఆమె వక్షోజాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఆమె ఓ పురుషునితో సెక్స్‌లో పాల్గొని, ఆ తర్వాత అలాగే అతని పక్కన పడుకుంటుంది. ఈ 30-40 సెకెండ్ల వీడియో క్లిప్ ఇప్పుడు వాట్సప్‌లో వైరల్ అవుతోంది. దీనిలో కనిపించే నటిని పోర్న్ స్టార్‌ అని అంటున్నారు. యూట్యూబ్‌లో కూడా ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. దానిని లక్షలాది మంది వీక్షిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ అలా ఒకరి ద్వారా ఒకరికి సర్క్యులేట్ అవుతూ చివరకు ఆ నటికి కూడా చేరింది. తర్వాత ఏమైంది.. ఈ ఏడాది జులైలో జరిగిన ఘటన తాలూకు వార్త.

ఫొటో సోర్స్, MANJITA VANZARA

3. వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు

మహిళల పీరియడ్స్ పై ప్రజల ఆలోచనా తీరు మారాల్సిన అవసరముందని మంజిత బలంగా చెబుతారు ఐపీఎస్ అధికారి మంజితా వంజారా.

నెలసరి సమయంలోనూ ఎలాంటి భయం లేకుండా డ్యూటీ చేస్తానని అంటున్నారు.

తన అనుభవాన్ని ఇలా గుర్తు చేసుకున్నారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే...

ఫొటో సోర్స్, Insia Dariwala/Facebook

ఫొటో క్యాప్షన్,

ఇన్సియా

4.మహిళల్లో సున్తీ: చాలా దేశాల్లో నిషేధించినా భారత్‌లో ఎందుకు కొనసాగుతోంది?

బలవంతంగా ఎవరైనా మీ శరీర భాగాన్ని కోస్తే... దాన్ని సమర్థించగలరా?

కానీ, భారత్‌తో సహా చాలా దేశాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వాటిపై ఇన్సియా పోరాటం చేస్తున్నారు.

పుణెకు చెందిన నిష్రిన్ సైఫ్ ఇలాంటి బాధితురాలే. ఆమె భయానక అనుభవం ఆమె మాటల్లోనే..

ఫొటో సోర్స్, Getty Images

5.ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత

1972, ఆగస్టు 4. బీబీసీ వార్తలు వస్తున్నాయి. హఠాత్తుగా యుగాండా నియంత ఈదీ అమీన్ ఆ దేశంలో ఎన్నో ఏళ్లనుంచీ ఉంటున్న 60 వేల మంది ఆసియా వాసులను అప్పటికప్పుడే దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాడని చెప్పారు.

దేశం విడిచి వెళ్లడానికి వారందరికీ కేవలం 90 రోజుల గడువు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

ఆరు అడుగుల నాలుగు అంగుళాల పొడవు, 135 కిలోల బరువు ఉండే అమీన్‌ను ప్రపంచ చరిత్రలో అత్యంత క్రూరుడైన నియంతగా చెబుతారు. ఎవరాయన ఏంటా కథ.

ఇలాంటి మరిన్ని కథనాల కోసం బీబీసీ తెలుగు‌ను చూడండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)