ఏంజెలీనా జోలీ: రాజకీయాల్లోకి వస్తా.. బీబీసీ ఇంటర్వ్యూలో వెల్లడించిన హాలీవుడ్ నటి

  • 29 డిసెంబర్ 2018
సిరియా శరణార్థి చిన్నారితో ఏంజెలీనా జోలీ Image copyright Getty Images
చిత్రం శీర్షిక సిరియా శరణార్థి చిన్నారితో ఏంజెలీనా జోలీ

హాలీవుడ్ అందాల భామ ఏంజెలీనా జోలీ త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలిచ్చారు. తాజాగా ఆమె 'బీబీసీ'కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'బీబీసీ టుడే' శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. ''ఇరవయ్యేళ్ల కిందటైతే రాజకీయాల్లో రాననే చెప్పేదాన్ని.. కానీ, ఇప్పుడు నా అవసరం ఉన్న రంగంలోకి వెళ్లాలనుకుంటున్నాను'' అన్నారు.

జోలీ ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థకు ప్రత్యేక రాయబారిగా పనిచేస్తున్నారు.

అంతేకాదు.. లైంగిక హింసకు వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగానూ ఆమె ప్రచారం చేస్తుంటారు.

Image copyright Getty Images

తాజా ఇంటర్వ్యూలో ఆమె అమెరికా రాజకీయాలు, సోషల్ మీడియా, లైంగిక హింస, అంతర్జాతీయంగా పెరుగుతున్న శరణార్థుల సమస్య వంటి అనేక అంశాలపై మాట్లాడారు.

రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆమె.. ''ఇరవయ్యేళ్ల కిందట ఈ ప్రశ్న అడిగితే నవ్వి ఊరుకునేదాన్నేమో. నేను రాజకీయాలకు సరిపోతానో లేదో తెలియదు కానీ నా అవసరం ఉన్న చోట పనిచేస్తాను. నాకు ప్రభుత్వాలు, సైన్యంతో కలిసి పనిచేసే సామర్థ్యం ఉంది. ఎంతో చేయడానికి అవకాశం ఉన్న స్థానంలో పనిచేయడానికి ఆసక్తి చూపుతాను'' అని వివరించారు.

బీబీసీలో కొత్తగా వారంవారం ప్రసారం కానున్న చిన్నారుల వార్తల కార్యక్రమంలోనూ జోలీ పాల్గొంటున్నారు.

టెక్నాలజీ, పర్యావరణం, సోషల్ మీడియాకు సంబంధించిన వార్తలతో 7-12 ఏళ్ల పిల్లల కోసం రూపొందిస్తున్న ఈ కార్యక్రమానికి ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సేవలందించనున్నారు.

''ఒక తల్లిగా నా పిల్లలతో కలిసి ఇలాంటి మంచి కార్యక్రమం చూడడానికి ఇష్టపడతా''నని జోలీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

రోహిత్ శర్మ IND vs. SA: టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన హిట్ మ్యాన్

మెట్రో రైలు చార్జీల పెంపుపై నిరసన: దేశ రాజధానిలో హింస.. ముగ్గురి మృతి

‘డియరెస్ట్ మోదీజీ... దక్షిణాది సినీ కళాకారులకు స్థానం లేదా?’ - ఉపాసన కొణిదెల

కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించారంటూ భారత్-పాక్ పరస్పర ఆరోపణలు

వాట్సప్‌పై రోజుకు రూ.14.5 ట్యాక్స్.. ఆందోళన చేస్తున్న జనం

టర్కీ అధ్యక్షుడి హెచ్చరిక: 'కుర్దు ఫైటర్లు ఉత్తర సిరియా నుంచి వెనక్కి వెళ్లకపోతే తలలు చిదిమేస్తాం’

#100WOMEN: పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ ఎందుకన్నారు...

బ్రెగ్జిట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ