పిల్లలకు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నాయా.. కారణం ఇదే: అధ్యయనం

ఫొటో సోర్స్, Getty Images
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, వీడియో గేమ్ సాధనాలు ఎక్కువగా వాడే పిల్లల్లో మెదడు కుంచించుకుపోతున్నట్లు అమెరికాలో జరుగుతున్న ఒక ముఖ్యమైన అధ్యయనంలో వెల్లడైంది.
రోజుకు ఏడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఇలాంటి సాధనాలపై వెచ్చించే తొమ్మిది, పదేళ్ల పిల్లలపై ఈ ప్రభావం పడుతోందని అధ్యయనం చెబుతోంది.
4,500 మంది చిన్నారులపై ఈ అధ్యయనం జరుపుతున్నారు. ఇది అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) 30 కోట్ల డాలర్లతో చేపట్టిన ప్రాజెక్టు.
మెదడులో కుంచించుకుపోయే భాగమైన కార్టెక్స్, శరీరంలోని జ్ఞానేంద్రియాలు అందించే సమాచారాన్ని విశ్లేషిస్తుంది.
మొబైల్, ఇతర సాధనాలపై రెండు గంటలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం గడిపే పిల్లలు భాష, రీజనింగ్ సంబంధిత అంశాలపై పరీక్షల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నట్లు తేలింది.
మొబైల్, ఇతర సాధనాల వాడకం పిల్లల్లో వ్యసనంగా మారుతోందా అన్నది గుర్తించడం ఈ అధ్యయన ప్రధానోద్దేశం.
మొబైల్ ఎక్కువ సేపు వాడే పిల్లల్లో కుంచించుకుపోతున్న మెదడు
ఇవికూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)