బంగ్లాదేశ్ ఎన్నికలు: ఎంపీగా గెలిచిన క్రికెట్ కెప్టెన్ మొర్తాజా

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఓ అరుదైన ఘటన జరిగింది. ఆ దేశ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ మష్రఫే మొర్తాజా ఎన్నికల గ్రౌండ్లో తన ప్రత్యర్థిని క్లీన్ బౌల్డ్ చేశాడు. పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు.
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొర్తాజా భారీ మెజార్టీతో గెలిచాడు. తన ప్రత్యర్థిపై 2 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం సాధించాడు.
ఈ ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఫొటో సోర్స్, Getty Images
నరైల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఇతనికి 2.71 లక్షల ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి ఫరీదుజ్మాన్‌కి కేవలం 7883 ఓట్ల మాత్రమే పోలయ్యాయి.
ఈ నెల మొదట్లో వెస్టిండీస్‌తో ప్రారంభమైన వన్డే సీరీస్‌కి ముందే మొర్తాజా తాను ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు.
తాను 2019 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ నుంచి వైదొలుగుతానని కూడా చెప్పాడు.
నవంబర్‌లో "ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని.. రాజకీయాల్లోకి రాకుంటే దేశాభివృద్ధి సాధ్యం కాదు" అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు.
ప్రస్తుతం తన ముందున్న లక్ష్యం 2019 వరల్డ్ కప్‌లో ఆడటం మాత్రమేననీ చెప్పాడు. తర్వాత ఇతనికి షేక్ హసీనా పార్టీలో టికెట్ లభించింది.
35 ఏళ్ల మొర్తాజా ప్రస్తుతం కేవలం వన్డేల్లోనే ఆడుతున్నాడు. ఇతను 2009లో టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఫొటో సోర్స్, Getty Images
2017లో టీ20 నుంచి రిటైరయ్యాడు. ఇప్పటి దాకా 202 అంతర్జాతీయ వన్డేలు ఆడగా 258 వికెట్లు తీశాడు.
బంగ్లాదేశ్‌లో క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉండి.. ఎంపీగా గెలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో నైమూర్ రహ్మాన్ కూడా ఇలాగే ఎంపీ అయ్యాడు.
మరోవైపు, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇ్రమాన్ ఖాన్ ఏకంగా ఆ దేశ ప్రధాని అయిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- BBC EXCLUSIVE: బంగ్లాదేశ్ మొదటి హిందూ చీఫ్ జస్టిస్ దేశ బహిష్కరణ
- బంగ్లాదేశ్: ఇద్దరి మరణం.. ఉద్యమానికి ఊపిరి పోసింది
- బంగ్లాదేశ్: ఖలేదా జియాకు ఏడేళ్ల జైలు శిక్ష
- రోహింజ్యాలను వెనక్కు పంపేందుకు కుదిరిన ఒప్పందం
- 'గాంధీ జాత్యహంకారి'
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా?
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- ఠాక్రే ట్రైలర్: దక్షిణ భారతీయులంటే బాల్ ఠాక్రేకు ఎందుకు నచ్చదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)