అరటిపండు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందా?

  • 4 జనవరి 2019
హ్యాంగోవర్ Image copyright Getty Images

కొత్త సంవత్సరంలో పార్టీల జోరు దాదాపు జనవరి అంతా కొనసాగుతూనే ఉంటుంది. బంధువులతో, స్నేహింతుల బలవంతంతో ఎక్కడో ఒక దగ్గర ఓ పెగ్గు ఎక్కువ కూడా తాగాల్సివస్తుంది.

కానీ, ఫలితంగా రాత్రి జరిగిన పార్టీ మత్తు దిగగానే, తల బరువుగా అనిపిస్తుంది. వాంతులు, కళ్లు తిరగడం ఉంటుంది. అలసటగా అనిపిస్తుంది.

చాలా మంది ఇది తాగడం వల్ల వచ్చిన హ్యాంగోవర్ అంటారు. ఊరగాయ, లేదా గుడ్డు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందని చెబుతారు.

ఎక్కువ మద్యం తాగిన తర్వాత తరచూ కొంతమంది హ్యాంగోవర్ ఉందని చెబుతుంటారు. దాంతో, రాత్రి పట్టుబట్టి ఎక్కువ మద్యం తాగించిన స్నేహితులే, తర్వాత రోజు హ్యాంగోవర్ దిగడానికి చిట్కాలు చెప్పడం మొదలెడతారు.

కానీ, దేనివల్ల మీకు నిజంగా హ్యాంగోవర్ నుంచి విముక్తి లభిస్తుంది.. అసలు అలాంటివి ఏవైనా ఉన్నాయా?

Image copyright Getty Images

వేల ఏళ్ల క్రితమే హ్యాంగోవర్

హ్యాగోవర్ దిగడం ఎలా? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, ఇది వేల ఏళ్ల క్రితం నుంచీ ఉంది. ఈజిఫ్టులో 1900 ఏళ్ల క్రితం దొరికిన ఒక మెనూలో మద్యం తాగిన తర్వాత ఆ హ్యాంగోవర్ దించుకోడానికి కొన్ని చిట్కాలు కూడా రాశారు.

అంటే ఆ కాలంలో కూడా జనం ఎక్కువ మద్యం తాగినపుడు ఆ హ్యాంగోవర్ వదిలించుకోడానికి నానా తంటాలు పడేవారని, దానికి పరిష్కారం వెతుక్కునేవారని తెలుస్తుంది. కానీ ఆ మెనూలో ఉన్న మందును ఈరోజుల్లో అమల్లోకి తీసుకురావడం చాలా కష్టం.

కానీ, ఇప్పటికీ మద్యం హ్యాంగోవర్ దిగడానికి ఎన్నో చిట్కాలు చెబుతుంటారు. అంటే వేయించిన కనరీ పిచ్చుక మాంసం, ఉప్పు చల్లిన రేగుపండ్లు, పచ్చి గుడ్డు, టమాటా జ్యూస్, సాస్ తదితరాలు తినమంటారు.

కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వీటిలో ఏదైనా మత్తు లేదా హ్యాంగోవర్ నుంచి నిజంగా విముక్తి కల్పిస్తుందా అనేది పక్కాగా చెప్పలేం.

ఎక్కువ మద్యం తాగడం వల్ల వచ్చిన ఆ హ్యాంగోవర్‌ను కేవలం సమయం మాత్రమే తగ్గించగలదు. దానికి పెద్ద కారణం ఏంటంటే.. అసలు హ్యాంగోవర్ ఎందుకు వస్తుందో ఇప్పటివరకూ తెలీలేదు.

Image copyright Getty Images

హ్యాంగోవర్ ఎందుకు వస్తుంది?

మనం ఎక్కువ మద్యం తాగినప్పుడు హ్యాంగోవర్‌లా అనిపిస్తుందని సైన్స్ చెబుతుంది. అంటే తల బరువుగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయని, అలసటగా ఉన్నట్టు చెబుతారు. అప్పటికే మన నుంచి మద్యం మత్తు దిగిపోయి ఉంటుంది.

అయినా, హ్యాంగోవర్ ఎందుకు ఉంటుంది?

మద్యం ఇథెనాల్‌తో తయారవుతుంది. ఇది మన శరీరంలో ఉన్న ఎంజైములను విరిచేసి వేరే రకాల రసాయనాలుగా మార్చేస్తుంది. వీటిలో కీలకమైనది ఎసిటాల్డిహైడ్. అది దీనిని మరింత విరిచేసి ఎసిటేట్ అనే రసాయనంగా మార్చేస్తుంది. ఈ ఎసిటేట్ కొవ్వు, నీళ్లుగా మారిపోతుంది. ఎసిటాల్డిహైడ్ వల్ల హ్యాంగోవర్ ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ఎసిటాల్డిహైడ్‌కు, మద్యం వల్ల ఏర్పడే హ్యాంగోవర్‌కు సంబంధం లేదని కొన్ని పరిశోధనల్లో తేలింది.

మద్యంలో కలిసే ఇతర రసాయనాల వల్ల హ్యాంగోవర్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాటిని కంజెనర్స్ అంటారు. వీటిలో చాలా రకాల కణాలు ఉంటాయి. ఇవి విస్కీ తయారయ్యే సమయంలో అందులో కలుస్తాయి. మద్యం ఎక్కువగా తాగినప్పుడు మాత్రమే, అవి ఉన్నట్లు అందరికీ తెలుస్తుంది.

చిక్కటి రంగు ఉన్న మద్యంలో ఈ గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే డార్క్ బర్బన్ మద్యం తాగితే, వోడ్కా కంటే ఎక్కువ మత్తుగా ఉంటుంది. అయితే దీని ప్రభావం ఒక్కో వ్యక్తిపై వేరువేరుగా కనిపిస్తుంది. తర్వాత తాగేవారి వయసు నుంచి వారు మద్యం తాగే లిమిట్‌పై కూడా హ్యాంగోవర్ ప్రభావం ఆధారపడుతుంది.

Image copyright PA

అలసటగా ఎందుకుంటుంది?

నిజానికి మద్యం తాగాక ఉండే హ్యాంగోవర్ ఏదో ఒక కారణం వల్లే రాదు. దానికి చాలా కారణాలు ఉంటాయి. మద్యం తాగడం వల్ల మన శరీరంలోని హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతాయి.

ఆ సమయంలో జనం మూత్రం ఎక్కువగా వెళ్తారు. దాంతో, వారి శరీరంలో నీరు తగ్గిపోతుంది. అందువల్ల కూడా తల బరువుగా మారచ్చు. మద్యం తాగడం వల్ల నిద్రపై కూడా ప్రభావం పడుతుంది. జనం తరచూ అర్థరాత్రి వరకూ మద్య తాగుతుంటారు. ఫలితంగా వారికి సరిగా నిద్రపట్టదు. అలసటగా ఉండడానికి ఇది కూడా ఒక కారణం.

"ఎక్కువ మద్యం తాగిన తర్వాత మన శరీరం దానితో పోరాడేందుకు ప్రయత్నిస్తుంది. అంటే అది మద్యం వల్ల శరీరంపై చెడు ప్రభావం పడకుండా చేయాలని చూస్తుంది. బహుశా దానివల్ల కూడా జనం ఎక్కువ తాగిన తర్వాత గందరగోళానికి గురైనట్లు కనిపిస్తారు" అని నెదర్లాండ్‌ ఉట్రెక్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యోరిస్ సి వర్స్‌టర్ చెప్పారు.

ఇంటర్నెట్లో హ్యాంగోవర్ దిగడానికి చాలా రకాల చిట్కాలు కనిపిస్తాయి.

కొందరు అరటిపండు తింటే ఉపశమనం లభిస్తుందని చెబుతారు. ఎందుకంటే మద్యం తాగడం వల్ల శరీరంలోని పొటాషియం తగ్గిపోతుందని, అరటిపండు తినడం వల్ల శరీరానికి పొటాషియం లోటు తీరుతుంది అంటారు. హ్యాంగోవర్ కూడా దిగిపోతుందని చెబుతారు. కానీ, అరటిపండు తినగానే తీరిపోయేలా.. పొటాషియం లోపం అనేది ఎప్పుడో ఒకసారి అతిగా మద్యం తాగడం వల్ల ఏర్పడదు.

Image copyright Getty Images

విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం

హ్యాంగోవర్ దిగడానికి కొంతమంది బ్రేక్‌ఫాస్ట్ బాగా తినాలని సలహా ఇస్తారు. ఇంకొందరు మద్యం తాగే ముందు కడుపునిండా తినాలని సూచిస్తారు.

అయితే కొంతమంది మాత్రం హ్యాంగోవర్ తగ్గాలంటే, గుడ్డు తినమని చెబుతుంటారు. దాన్లో ఉన్న అమైనో ఆమ్లాలు ఎసిటాల్డిహైడ్‌ను విరేచేయడానికి సాయం అవుతాయని అంటారు. గుడ్డు తినడం వల్ల కాస్త ఫలితం ఉండచ్చేమో... కానీ, దానివల్ల హ్యాంగోవర్ నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుందని చెప్పడం మాత్రం కష్టం.

ఎక్కువ మద్యం తాగడం వల్ల వచ్చే హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే విశ్రాంతి తీసుకోవడం. బాగా నీళ్లు తాగడం. ఒక ఆస్ప్రిన్ మాత్ర వేసుకోవడం అన్నిటికంటే మంచిది. మద్యం తీసుకునే ముందు బాగా తినడం వల్ల, మెల్లమెల్లగా తాగడం వల్ల కూడా హ్యాంగోవర్ తక్కువగా ఉంటుంది.

ఇంకో ముఖ్యమైన విషయం, మీరు ఎక్కువ మద్యం తాగకపోవడం అనేది మరీ మంచిది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు