చైనాలో మంచు పండుగ... మైనస్ 35 డిగ్రీల చలిలో సరికొత్త నగర నిర్మాణం

  • 7 జనవరి 2019
మంచు ఉత్సవాలు Image copyright EPA

మంచు కురిసే వేళ ఈశాన్య చైనా కొత్త అందాలను సంతరించుకుంటుంది. హర్బిన్ మంచు ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. మంచుతో కప్పేసి ఉన్న కోటలను, ఐస్‌తో చేసిన శిల్పాలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

1980లో తొలిసారి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మంచు కళాఖండాలు ఇందులో ప్రదర్శిస్తున్నట్లు చెబుతుంటారు.

Image copyright Reuters
Image copyright EPA

ఉత్సవాల ప్రారంభ సూచకంగా ఏర్పాటు చేసిన లైట్ షో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.

Image copyright Empics

ఏటా వివిధ దేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

Image copyright EPA

దాదాపు 1,20,000 ఘనపు మీటర్ల మంచు, స్నో ఫాల్‌తో ఈ ఐస్ వరల్డ్‌ను నిర్మించారు.

Image copyright EPA

ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 35 సెంటీగ్రేడ్‌కు పడిపోవడంతో ఆర్టిస్టులు తమ సృజనకు పదును పెట్టి ఇలా మంచు నగరాన్ని నిర్మించారు.

Image copyright Reuters

ఇక్కడి సొన్గుహ సరస్సు పూర్తిగా మంచుతో గడ్డకట్టడంతో అక్కడున్న మంచుతో 2019 స్నోమెన్‌లను సృష్టించారు

Image copyright EPA

వణికించే ఈ మంచులో ఈత పోటీలు కూడా జరుగుతాయి. దాదాపు 300 మంది ఈ పోటీలో పాల్గొన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)