తులసి గబార్డ్: మోదీకి మద్దతు ఇచ్చే ఈ హిందూ మహిళ అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోగలరా?

  • 13 జనవరి 2019
ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు ఒక మందిరంలో పూజలు చేస్తున్న తులసి Image copyright TulsiGabbard/facebook
చిత్రం శీర్షిక ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు ఒక మందిరంలో పూజలు చేస్తున్న తులసి

అమెరికాలోని హవాయి ప్రాంత ఎంపీ తులసీ గబార్డ్ 2020లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.

37 ఏళ్ల తులసీ గబార్డ్ డెమొక్రటిక్ పార్టీలోని ముఖ్యమైన నేతల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు.

2016లో అధ్యక్ష ఎన్నికలు జరిగినపుడు ఆమె హిల్లరీ క్లింటన్‌ స్థానంలో బెర్నీ శాండర్స్‌కు మద్దతిచ్చారు.

2016లో ఆమె డెమొక్రటిక్ నేషనల్ కమిటీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. కానీ శాండర్స్‌కు మద్దతిచ్చిన తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

1981లో అమెరికాలోని సమోవాలో జన్మించిన తులసీ గబార్డ్ చిన్న వయసులోనే అమెరికా పార్లమెంటుకు ఎన్నికైన మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె 21 ఏళ్లకే ఎంపీ అయ్యారు.

Image copyright TulsiGabbard/facebook
చిత్రం శీర్షిక అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక మద్దతుదారుల్లో తులసీ గబార్డ్ కూడా ఒకరని భావిస్తున్నారు
Image copyright INSTAGRAM/TULSIGABBARD

భారత్‌తో బంధం

స్టేట్ సెనేటర్ మైక్ గబార్డ్ కూతురైన తులసి మొదట తన పదవీకాలంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ ఒక చట్టం చేయడానికి మద్దతు ప్రకటించారు. దాని వల్ల మిగతా ఇంధనాలపై ట్యాక్స్ తగ్గుతుందని భావించారు.

తర్వాత తులసీ గబార్డ్ హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్ సర్వీస్‌లో చేరారు. ఒక ఏడాది పాటు ఇరాక్ యుద్ధంలో తన సేవలు అందించారు.

ఆ తర్వాత ఆమె 2011లో ఇండోనేషియా సైన్యంతో కలిసి పీస్ కీపింగ్ ట్రైనింగ్‌లో కూడా భాగం అయ్యారు.

Image copyright INSTAGRAM/TULSIGABBARD

2015లో అమెరికా సైన్యంలో మేజర్ పదవిని సొంతం చేసుకున్న తులసీ గబార్డ్ ఇప్పుడు కూడా సైన్యంతో తన అనుబంధం కొనసాగిస్తున్నారు.

తులసీ గబార్డ్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని అకుంటున్నట్టు చెప్పగానే, భారత్‌లో ఆమె పేరున ట్విటర్‌ ట్రెండింగ్ మొదలైంది.

కానీ భారత్‌తో తులసికి ఉన్న బంధం గురించి చెప్పుకుంటే.. ఆమెకు ఈ దేశంతో ఎలాంటి సంబంధం లేదు. ఆమె తల్లిదండ్రులు కూడా భారతీయులు కారు.

కానీ హిందూ మతాన్ని విశ్వసించే తులసీ గబార్డ్‌కు అమెరికాలోని భారతీయుల నుంచి భారీ మద్దతు ఉంది. అమెరికా పార్లమెంటుకు వెళ్లిన తొలి హిందువుగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.

గత ఏడాది అమెరికా న్యూస్ చానల్ ఒక కార్యక్రమంలో హిందువులకు వ్యతిరేకంగా చేసిన కామెంట్‌పై ఆమె తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు.

Image copyright INSTAGRAM/TULSIGABBARD
Image copyright TulsiGabbard/facebook
చిత్రం శీర్షిక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌తో తులసీ గబార్డ్

ప్రధాని మోదీకి మద్దతు

అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక మద్దతుదారుల్లో తులసీ గబార్డ్ కూడా ఒకరని భావిస్తున్నారు.

2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడానికి ముందే ఆమె ఆయనకు తన మద్దతు ప్రకటించారు.

2002లో జరిగిన గుజరాత్ ఘర్షణలతో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా రాకుండా నిషేధం విధించినప్పుడు, ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించిన కొద్దిమందిలో తులసీ గబార్డ్ కూడా ఉన్నారు.

హిందూ మతాన్ని విశ్వసించే తులసి తన భారత పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు.

అంతే కాదు ప్రధాన మంత్రి మోదీ న్యూయార్క్ వెళ్లినప్పుడు కూడా ఆయన తులసీ గబార్డ్‌ కోసం కాస్త సమయం కేటాయించారు.

కొన్నేళ్ల క్రితం హిందూ సంప్రదాయాలో వివాహం చేసుకున్న తులసీ గబార్డ్ ప్రధాని నరేంద్ర మోదీ మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మద్దతుగా నిలిచారు.

Image copyright TulsiGabbard/facebook
చిత్రం శీర్షిక తులసీ గబార్డ్ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు

తులసి గబార్డ్ రాజకీయ చాతుర్యం

గబార్డ్ రాజకీయ జీవితం విషయానికి వస్తే అమెరికాలో రిపబ్లికన్ పార్టీ వారు కూడా ఇష్టపడేంత ఇమేజ్ ఆమె సొంతం.

2016లో బెర్నీ శాండర్స్‌కు మద్దతిచ్చిన తులసి డీఎన్‌సి ఉపాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.

2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు తులసీ గబార్డ్ శుక్రవారం( 11-01-19న) ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)