నేను ఎనిమిదేళ్ల వయసు నుంచే బాక్సింగ్ చేస్తున్నా
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

నేను ఎనిమిదేళ్ల వయసు నుంచే బాక్సింగ్ చేస్తున్నా

  • 14 జనవరి 2019

బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునేవారు చాలా తక్కువ మందే కనిపిస్తుంటారు. కానీ, థాయ్‌లాండ్‌లో మాత్రం పిల్లలు పదేళ్లు కూడా దాటకముందు నుంచే బాక్సింగ్‌లో అదరగొడుతున్నారు. అలాంటి వారిలో ఈ బాలిక ఒకరు.

ఈ బాలిక పేరు మించాయా సిమ్‌వోంగ్. ఎనిమిదేళ్ల వయసు నుంచే బాక్సింగ్‌లో రాణిస్తోంది.

ప్రస్తుతం 11 ఏళ్ల వయసున్న ఈ అమ్మాయి.. పంచులు ఇస్తుంటే ఔరా! అనాల్సిందే.

తాను ఇప్పటివరకు 40కి పైగా పోటీల్లో పాల్గొన్నానని మించాయా చెప్పారు.

థాయ్‌లాండ్‌లో చైల్డ్ బాక్సింగ్‌కు చాలా ఆదరణ ఉంది. అయితే, ఇటీవల ఓ 13 ఏళ్ల బాలుడు బాక్సింగ్‌‌లో పోటీపడుతూ మృతి చెందాడు.

దాంతో ఈ ఆట పిల్లలకు ఎంత మేరకు సురక్షితం? అన్న చర్చ మొదలైంది.

బాక్సింగ్‌లో ఆటగాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు చిన్నచిన్న పోరపాట్ల వల్ల ఆటగాళ్లు ప్రమాదాల బారిన పడుతున్నారు.

అలాంటి అనుభవం తనకు కూడా ఎదురైందని మించాయా తెలిపారు.

"ఓసారి బాక్సింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి నా కడుపులో పంచ్ ఇచ్చారు. దాంతో నాకు ఊపిరాడక కింద పడిపోయాను" గుర్తు చేశారు.

"ఆటలో గెలిస్తే నగదు బహుమతులు వస్తాయి. అప్పుడప్పుడు కొందరు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంటారు. ఇప్పటి వరకు ఓసారి అత్యధికంగా రూ.10,000 సంపాదించాను" అని ఈ బాలిక వివరించారు.

ప్రస్తుతం తాను సంపాదించే డబ్బులతోనే చదువుకుంటున్నానని, కుటుంబానికి సాయపడటంతో పాటు, ఆటలో రాణిస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ అమ్మాయి అంటోంది.

థాయ్‌లాండ్‌లో ఇలా చిన్నవయసులోనే బాక్సింగ్‌లో రాణిస్తున్న వాళ్లు చాలానే ఉంటారు. మరో విషయం ఏమిటంటే, థాయ్‌లాండ్‌లో అనేక పేద కుటుంబాలకు ఈ ఆటే ప్రధాన ఆదాయ వనరుగా కూడా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)