చంద్రుడు: జాబిల్లి మీద మొలకెత్తిన పత్తి విత్తనం

  • 16 జనవరి 2019
చంద్రుని మీద పత్తి మొలక Image copyright CLEP
చిత్రం శీర్షిక చంద్రుని మీద పత్తి మొలక

చాంగీ-4 అనే రోబోటిక్ అంతరిక్ష వాహనంలో ఇటీవల చంద్రుని మీదకు చైనా పంపిన పత్తి విత్తనాలు మొలకెత్తాయి. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేష్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.

చంద్రుని మీద ఇలాంటి జీవ సంబంధమైన పరిణామం చూడటం ఇదే తొలిసారి. దీంతో అంతరిక్షంలో మరింత విస్తృతమైన పరిశోధనలు జరిపేందుకు కీలక అడుగు పడినట్లేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

గతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మొక్కలు పెరిగాయి. కానీ, చంద్రుని మీద విత్తనాలు మొలకెత్తడం మాత్రం ఇదే తొలిసారి.

చంద్రుడి ఆవలి వైపున, భూమిని ఎన్నడూ చూడని 'అంధకార' ప్రదేశంలో చాంగీ-4 విజయవంతంగా దిగిందని ఈ నెల 3న చైనా ప్రకటించింది.

ఆ ప్రాంతంలోని పరిస్థితులను విశ్లేషించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను చాంగీ-4 వాహనం తీసుకుని వెళ్లింది.

అక్కడ జీవసంబంధమైన పరిశోధనలు జరిపేందుకు పత్తి విత్తనాలను, 3 కిలోల బరువున్న బంగాళాదుంపలు, అరబిడాప్పిస్ అనే పూల విత్తనాలు, యీస్ట్, పట్టుపురుగు గుడ్లను కూడా ఆ వాహనంలో చైనా శాస్త్రవేత్తలు పంపించారు.

తాజా పరిశోధన మున్ముందు అంగాకర గ్రహం మీద కూడా ఇలాంటి ప్రయోగాలు చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Image copyright CLEP
చిత్రం శీర్షిక ఈ వాహనంలో తీసుకెళ్లిన పత్తి విత్తనమే చంద్రుని మీద దిగిన తర్వాత మొలకెత్తింది.

వ్యోమగాములు భూమి మీద నుంచి ఆహార పదార్థాలు తీసుకెళ్లాల్సిన పనిలేకుండా, అంతరిక్షంలోనే పండించుకునే దిశగా ఓ అడుగు పడిందని అంటున్నారు.

పత్తి విత్తనం మొలకెత్తిన చిత్రాన్ని చైనా అధికార కమ్యూనిస్టు పార్టీకి చెందిన 'పీపుల్స్ డైలీ' పత్రిక ట్వీట్ చేసింది. చంద్రుని మీద మానవుడు చేపట్టిన మొట్టమొదటి జీవ సంబంధమైన ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionచంద్రుని ‘అంధకార ప్రాంతం’పై దిగిన చైనా అంతరిక్ష వాహనం

ఇదొక "శుభ వార్త" అని ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త ఫ్రెడ్ వాట్సన్ బీబీసీతో అన్నారు.

"ఇక చంద్రుని మీద వ్యోమగాములు తమకు కావాల్సిన పంటలు పండించుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న విషయం దీనితో అర్థమవుతోంది" అని వాట్సన్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్

టాకింగ్ బాక్స్: కెన్యాలో బాలికలపై వేధింపులకు ఇవి ఎలా పరిష్కారం చూపిస్తున్నాయి...

ఉప్పల‌పాడు పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి

సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్

ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీ సేఫ్ కాదా? క్రిప్టో కరెన్సీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమా...

అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి తరువాత మరో కండక్టర్ ఆత్మహత్య

'ఏడేళ్ల వయసులో జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్లకు ఎందుకు చెప్పానంటే...'