వీడియో: అవిశ్వాస తీర్మానాన్ని చదువుతున్న జెరెమీ కార్బిన్

వీడియో: అవిశ్వాస తీర్మానాన్ని చదువుతున్న జెరెమీ కార్బిన్

బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే బ్రెగ్జిట్ ఒప్పందం 230 ఓట్ల తేడాతో దారుణంగా ఓటమి పాలైంది. బ్రిటన్ ప్రభుత్వ చరిత్రలోనే ఇది ఘోర పరాజయం.

యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు నిర్దేశించిన నిబంధనలకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని ఎంపీలు 432-202 తేడాతో తిరస్కరించారు.

లేబర్ పార్టీ నేత జెరెమీ బార్బిన్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అందులో థెరెసాకు మెజారిటీ సభ్యుల మద్దతు లభించకపోతే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

బ్రిటన్ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 7 గంటలకు అవిశ్వాస తీర్మానం జరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)